Begin typing your search above and press return to search.
ఇండియాలో కరప్షన్ కింగ్ లకు కొదవలేదట..
By: Tupaki Desk | 8 March 2017 5:00 AM GMTఇండియా పరువు మరోసారి పోయింది. అవినీతి విషయంలో ఆసియాలో మన దేశాన్ని మించింది ఇంకోటి లేదని మరోసారి రుజువైంది. రెండింట మూడొంతుల మంది భారతీయులు చాయ్ పానీకోసం డబ్బులివ్వటం దగ్గరినుంచి అనేక రూపాల్లో లంచాలు ఇవ్వక తప్పటం లేదని స్పష్టమైంది. భారత్ లో 69 శాతం మంది అంటే ప్రతీ పది మందిలో దాదాపు ఏడుగురు దీని బాధితులేనని ఈ జాఢ్యంపై పోరాడుతున్న ప్రముఖ సంస్థ ‘ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్’ తెలిపింది. కాగా మన తరువాత 65% మంది బాధితులతో వియత్నాం రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ లో 40% - చైనాలో 26% మంది బాధితులు ఉన్నారు. అవినీతి నిర్మూలనలో జపాన్ ముందుంది. జపాన్‌లో అవినీతి కేవలం 0.2 శాతంగా, దక్షిణ కొరియాలో మూడు శాతంగా ఉంది. దాదాపు పదహారు దేశాల్లో 20వేల మందిని ప్రశ్నించిన అనంతరం ఈ నివేదిక రూపొందించారు.
కాగా నిరుడు ఒక్క ఏడాదే 900 మిలియన్ల మంది వివిధ రూపాల్లో వివిధ కారణాలతో లంచాలిచ్చారని సర్వే అంచనా వేసింది. లంచాలు తీసుకోవటంలో పోలీసులు అగ్రస్థానంలో ఉన్నారు. లంచాలిస్తున్న వారిలో 38శాతం మంది పేదలే ఉండటం గమనార్హం. బహుమతి రూపంలోనో, ఏదైనా ప్రయోజనాన్ని చేకూర్చే రూపంలోనో, మరో రకంగానో లంచాలిస్తున్నారని సర్వే తెలిపింది. పోలీసులు - న్యాయమూర్తులు - కోర్టు అధికారులు - టీచర్లు - ఆసుపత్రి సిబ్బంది - ప్రభుత్వ అధికారులకు ఓ డాక్యుమెంట్ పొందటానికో లేక ఏదైనా చిన్న చిన్న సేవలు పొందటానికో లంచాలు ఇవ్వాల్సి వస్తున్నదని సర్వేలో తేలింది.
భారత్ లో అవినీతిలో పోలీసు వ్యవస్థ మొదటి స్థానంలో ఉందని, ఇది అవినీతిమయమని 85% మంది అభిప్రాయపడ్డారు. తర్వాతి స్థానాల్లో ప్రభుత్వ అధికారులు - వ్యాపారవేత్తలు - స్థానిక కౌన్సిలర్లు - ఎంపీలు - పన్ను అధికారులు - మతపెద్దలు-బాబాలు ఉన్నారు. ఎంపీలు అవినీతిపరులని 76% మంది - జడ్జిలు - మేజిస్ట్రేట్లు అవినీతిపరులని 66% మంది చెప్పారు. ప్రజారోగ్య సేవలకు దాదాపు 59% మంది - విద్యా విషయాల్లో 58% మంది లంచాలు ఇవ్వాల్సి వచ్చింది. భారత్ లో లంచం ఇచ్చినవారిలో దాదాపు 73% మంది పేదలే. పాక్ లో ఈ సంఖ్య 64 శాతంగా ఉంది. మొత్తానికి ఇండియాలో పైసలిస్తే కానీ పని జరగదని తేల్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/