Begin typing your search above and press return to search.

కరోనాను జయించిన 10లక్షలమంది.. దేశంలో రికార్డ్

By:  Tupaki Desk   |   30 July 2020 2:20 PM IST
కరోనాను జయించిన 10లక్షలమంది.. దేశంలో రికార్డ్
X
దేశంలో కరోనా కల్లోలంలోనే కాదు... రికవరీలోనూ కొత్త రికార్డులు నమోదు చేస్తుండడం ఊరటనిస్తోంది. రోజుకు 50వేల కేసులకు పైగా దేశంలో నమోదవుతున్నాయి. అదే సమయంలో రికవరీలు కూడా అదే స్థాయిలో ఉండడం ఉపశమనంగా మారింది.

తాజాగా భారత్ లో కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య పది లక్షలకు చేరిందని ప్రభుత్వం తెలిపింది. రికవరీ పర్సంటేజ్ 65శాతం వరకూ ఉందని పేర్కొంది.

దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 15,83,792గా ఉంది. ఇక మరణించిన వారి సంఖ్య 34968గా ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఏకంగా 10,20582గా ఉండడం ఊరట కలిగించే అంశం. ఏకంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1 మిలియన్ దాటడం దేశంలో ఊరటగా చెప్పవచ్చు. దేశంలో 16లక్షల మంది కరోనా బారిన పడితే అందులో ఏకంగా పదిలక్షల మందికి పైగా ఇప్పటికే కోలుకోవడం సానుకూల అంశమని కేంద్రం ప్రకటించింది.

దీన్ని బట్టి భారత్ లో రికవరీ రేటు మెరుగ్గా ఉందని.. కరోనా మరణాల శాతం క్రమంగా తగ్గుతోందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ఇక 24గంటల్లో దేశంలో నమోదైన అత్యధిక కేసులు ఆంధ్రప్రదేశ్ లోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో 10వేలకు పైగా కేసులు.. మహారాష్ట్రలో 9వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసుల్లో మహారాష్ట్రను దాటేసి ఏపీ అగ్రస్థానంలోకి వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. 24గంటల్లో ఏపీలో ఏకంగా 70వేలకు పైగా టెస్టులు చేయడమే అత్యధిక కేసులు నమోదు కావడానికి కారణంగా తెలుస్తోంది.