Begin typing your search above and press return to search.
ప్రపంచంలో మరే దేశానికి లేని చెత్త రికార్డు భారత్ పేరిట
By: Tupaki Desk | 2 May 2021 5:30 AM GMTఅనుకున్నదే జరుగుతున్నది. అంచనాలు ఏ మాత్రం తీసిపోని రీతిలో కరోనా విలయం సాగుతోంది.కేసుల నమోదులో ఇప్పటివరకు నమోదైన రికార్డుల్ని భారత్ ఎప్పుడో దాటేసింది. అంతేకాదు.. ప్రపంచంలో మరేదేశం కూడా చేరుకోలేని చెత్త రికార్డుల్ని భారత్ తన పేరుతో నమోదు చేసుకుంటోంది. పాలకుల నిర్లక్ష్యం.. అంతకు మించిన అలక్ష్యం.. రాజకీయం.. రాజకీయ ప్రయోజనాలు తప్పించి మరింకేమీ ముఖ్యం కాదన్నట్లుగా ఉన్న తీరు ఇప్పుడు కొత్త సమస్యలకు తెర తీస్తోంది.
ప్రపంచంలో తొలిసారి మే ఒకటి విడుదల చేసిన నివేదికప్రకారం దేశ వ్యాప్తంగా రోజులో నమోదైన అధికారిక కేసులు నాలుగు లక్షలకు పైనే. పలు రాష్ట్రాల్లో అనధికారికంగా కేసులు నమోదు అవుతున్నా.. వాటిని రికార్డుల్లో జేర్చటం లేదన్న మాట వినిపిస్తోంది. జనవరి 8న అమెరికా తొలిసారి రోజులో మూడు లక్షల కేసు మార్కును దాటగా.. భారత్ దాన్ని ఏప్రిల్ లో దాటేసింది. అప్పటినుంచి రోజురోజుకు కేసుల నమోదు అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా నూతన గరిష్ఠాన్ని నమోదు చేసింది.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4.01 లక్షల కేసులు నమోదైనట్లుగా తేల్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నెల రెండో వారానికి కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరుకోవటమే కాదు.. ఈ నెలాఖరు నాటికి మరణాలు గరిష్ఠ స్థాయికి చేరుకునే వీలుంది. గడిచిన వారం రోజులుగా పాజిటివిటీ రేటు 20 శాతానికి తగ్గకపోవటంతో చూస్తే.. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయని చెబుతున్నారు.
గత సెప్టెంబరుతో పోలిస్తే.. ఇప్పుడు కరోనా ప్రమాదం అంతకు ఐదు రెట్లు ఎక్కువగా పెరిగినట్లు చెప్పక తప్పదు. దేశ వ్యాప్తంగా పాజిటివిటీ రేటు 17.06 శాతానికి పెరిగితే.. మహారాష్ట్ర.. ఢిల్లీల్లో నానాటికి పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. తొలిసారి ఉత్తరప్రదేవ్ లో 300 మందికి పైగా మరణించటం.. ఆసుపత్రుల్లో పడకలు.. ఆక్సిజన్ దొరక్క ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తంగా రానున్న నెల రోజులు దేశ ప్రజలకు అత్యంత కీలక సమయంగా చెప్పక తప్పదు.