Begin typing your search above and press return to search.

అక్రమిత కాశ్శీర్ లో ఏం జరుగుతుందో తెలుసా?

By:  Tupaki Desk   |   1 Oct 2015 6:44 AM GMT
అక్రమిత కాశ్శీర్ లో ఏం జరుగుతుందో తెలుసా?
X
కాశ్శీర్ గురించి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అంతర్జాతీయ వేదికల మీద తెగ మాట్లాడేస్తున్నారు. భారత్.. పాక్ ల మధ్యనున్న ఉద్రిక్తతలు తొలిగిపోవటానికి కాశ్శీర్ లో భద్రతా సిబ్బంది మొత్తాన్ని ఉపసంహరించుకోవాలని చెబుతున్నారు. దేశంలో భాగమైన కాశ్శీర్ లో ఏం చేయాలో భారత్ కు అంతర్జాతీయ వేదికల మీద నుంచి చెబుతున్న పాకిస్థాన్ ప్రధాని.. తమ అధీనంలో ఉన్న పాక్ అక్రమిత కాశ్శీర్ లో ఏం జరుగుతుందో చూస్తే షరీఫ్ మాటల్లోని డొల్లతనం ఇట్టే అర్థమవవుతుంది.

కాశ్శీర్ గురించి ఓ పక్క మాట్లాడుతుంతే.. మరోవైపు పాక్ అక్రమిత కాశ్శీర్ లోని ప్రజలు పాక్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని భారత్ లో కలిపివేయాలంటూ వారు ఆందోళచేస్తున్నారు. పాక్ అక్రమిత కాశ్శీర్ లోని ముజఫరాబాద్.. గిల్గిత్.. కోట్లి సహా వివిధ ప్రాంతాల్లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయటం గమనార్హం.

పాక్ అక్రమణలో ఉన్న తమకు స్వేచ్ఛ కల్పించాలని.. స్వాంతంత్ర్యం ఇవ్వాలని.. విముక్తి ప్రసాదించాలని వేలాది మంది ఎలుగెత్తి చాటుతున్నారు. పాక్ సర్కారు మీద అక్రమిత కాశ్శీర్ ప్రజల ఆందోళనల్నిఉక్కుపాదంతో అణిచి వేయటానికి పాక్ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తమపై బల ప్రయోగం చేసే హక్కు పాక్ కు లేదని చెబుతున్న పాక్ అక్రమిత కాశ్శీర్ ప్రజల అక్రమందనలు అంతర్జాతీయ సమాజానికి అందాల్సిన అవసరం ఉంది. పాక్ కంటే కూడా పొరుగున ఉన్న భారత్ ఎంతో రెట్లు మెరుగని వారు వ్యాఖ్యానించటం గమనార్హం. మరి.. పాక్ అక్రమిత కాశ్శీర్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అంతర్జాతీయ వేదికపై భారత్ మరి ఎలాంటి గళం వినిపిస్తుందో చూడాలి.