Begin typing your search above and press return to search.

అమెరికాకు భారత్ అదిరిపోయే షాక్

By:  Tupaki Desk   |   22 Jun 2018 6:37 AM GMT
అమెరికాకు భారత్ అదిరిపోయే షాక్
X
చర్యకు.. ప్రతిచర్య.. అమెరికా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు భారత్ అంతే స్థాయిలో ప్రతిస్పందిస్తుండం వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారత్ కు షాక్ ఇచ్చానని ట్రంప్ అనుకునే లోపే భారత్ అమెరికాకు అదే రీతిలో షాక్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అంతర్జాతీయంగా ప్రస్తుతం వాణిజ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరింది. అమెరికా ట్రంప్ సర్కారు మార్చి 9న తమ దేశంలోకి స్టీల్, అల్యూమినియం ఉత్పత్తుల దిగుమతులపై టారీఫ్ లు వేయడం దుమారం రేపింది. ఈ వస్తువులను అమెరికాకు ఎక్కువగా ఉత్పత్తి చేసే భారత్ తీవ్రంగా నష్టపోతుందని తెలిసి కూడా ట్రంప్ సర్కారు వెనక్కి తగ్గలేదు. దీంతో దాదాపు 241 మిలియన్ డాలర్ల(రూ.1600 కోట్ల) భారత దేశ ఎగుమతులపైన ప్రభావం పడింది. టిట్ ఫర్ టాట్ అన్నట్టు తాజాగా అమెరికాకు అలాంటి షాకే భారత్ ఇచ్చింది.

తాజాగా మోడీ సర్కారు అమెరికా నుంచి భారత్ లోకి ఎక్కువగా దిగుమతి అయ్యే పప్పులు - స్టీల్ - ఐరన్ ఉత్పత్తులు సహా మొత్తం 29 ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పెంచిన సుంకాలు ఆగస్టు 4 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ తన నోటిఫికేషన్ లో పేర్కొంది. దీని వల్ల భారత్ కు ఎంతైతే నష్టం వాటిల్లిందో అమెరికాకు కూడా అంతే స్థాయిలో నష్టం జరుగుతుంది. అమెరికా తీసుకుంటున్న వాణిజ్య వ్యతిరేక విధానాలకు భారత్ కూడా అదే రీతిలో స్పందించడంతో ట్రంప్ సర్కారు ఇరకాటంలో పడింది.