Begin typing your search above and press return to search.

మరో ఘనత: అమెరికా, రష్యా, చైనా తర్వాత మనమే

By:  Tupaki Desk   |   7 Sep 2020 5:30 PM GMT
మరో ఘనత: అమెరికా, రష్యా, చైనా తర్వాత మనమే
X
చైనాతో ఓవైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ భారత్ అద్భుతమైన విజయం సాధించింది. హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమాన్ స్ట్రేటర్ వెహికల్ (హెచ్.ఎస్.టీ.డీ.వీ)ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్.డీ.వో) అభివృద్ధి చేసింది. దీంతో భవిష్యత్తులో దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థలు, వైమానిక ఫ్టాట్ ఫాంలకు శక్తినిచ్చే దేశీయంగా అభివృద్ధి చేశారు.

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను అభినందించారు. దీనిని ఓ మైలు రాయిగా అభివర్ణించారు. ప్రధాని మోడీ ఆత్మనిర్భర్ భారత్ ను సాకారం చేసే క్రమంలో ఈ మైలురాయిని సాధించినందుకు డీఆర్.డీ.వోను అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు.

భవిష్యత్తులో సూదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థలకు ఇది ఆసరాగా నిలిచి వైమానిక అవసరాలను తీర్చగలదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటికే హైపర్ సోనిక్ టెక్నాలజీ ఆయుధాలు సమకూర్చుకోవడంలో అమెరికాతోపాటు రష్యా, చైనా దేశాలు ముందున్నాయి. తరువాత ఫ్రాన్స్, భారత్, ఆస్ట్రేలియా కూడా ఈ తరహా టెక్నాలజీ పరీక్షల్లో నిమగ్నమయ్యాయి.