Begin typing your search above and press return to search.

చైనా, పాక్ బుద్ది చెప్పడానికి.. అణ్వాయుధ క్షిపణులను బయటికి తీస్తున్న భారత్!

By:  Tupaki Desk   |   8 Oct 2020 7:00 AM IST
చైనా, పాక్ బుద్ది చెప్పడానికి.. అణ్వాయుధ క్షిపణులను బయటికి తీస్తున్న భారత్!
X
గత కొద్దిరోజులుగా చైనా , భారత్ సరిహద్దు వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక అలాగే పాకిస్థాన్ కూడా సమయం కోసం అని వేచి చూస్తూ భారత్ పై దాడికి సిద్ధం అవుతుంది. అయితే పాక్ అనుకున్నంత ఈజీ కాదు భారత్ లో కాలుమోపాలి అంటే ..దీనితో చైనాతో చేయి కలిపి భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో శత్రువులని ఆపాలంటే ఒకటే మార్గం అని భావించి మిస్సైల్ వ్యూహాన్ని అమలుచేస్తోంది.

భారత్‌ క్షిపణి పరీక్షల ప్రయోగాన్ని ముమ్మరం చేసింది. మరో రెండు క్షిపణులను ప్రయోగించింది. జలాంతర్గాముల విధ్వంసక టోర్పడో పరీక్ష విజయవంతం కావడం అంటే శత్రువును నిలువరించేలా మరో అడుగుపడినట్లే. శౌర్య అణ్వాయుధాలను ప్రయోగించే హైపర్‌ సోనిక్ క్షిపణి. దీని స్ట్రైకింగ్ రేంజ్ వెయ్యి కిలోమీటర్లు. ఒడిశా ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్‌ లో శనివారం ఈ క్షిపణి పరీక్ష నిర్వహించారు. 2018 ఆగస్టులో పరీక్షించిన కె-15 సబ్మెరైన్ లాంచ్ బాలిస్టిక్ మిస్సైల్ ‌కు ఇది ల్యాండ్ వేరియంట్.

భూమి పై నుంచి భూమి పై ఉన్న లక్ష్యాలపై శౌర్య క్షిపణి ప్రయోగిస్తారు. పది మీటర్ల పొడవు. 74 సెంటీమీటర్ల చుట్టుకొలత. బరువు ఆరు టన్నుల రెండొందల కిలోలు. ఇక శౌర్య మిస్సైల్ ని ఒక ట్రక్కు పై ఎక్కడికైనా తీసుకెవెళ్ళవచ్చు. ట్రక్కు పై నుంచే దీన్ని ప్రయోగించవచ్చు . శత్రువు కంట పడకుండా దీన్ని దాచిపెట్టవచ్చు . ఉపగ్రహాలు కూడా దీని జాడ కనిపెట్టలేవు. ప్రస్తుతం పది రకాల బాలిస్టిక్ క్షిపణులు ఇప్పుడు ఇండియా వద్ద ఉన్నాయి. వాటిలో రెండు వేరియంట్లు పృథ్వి , అయిదు వేరియంట్లు అగ్ని క్షిపణులు. ధనుష్, ప్రహార్, ప్రగతి కూడా ఇదే రకం క్షిపణులు. కాకపోతే వీటి రేంజ్, పే‌లోడ్, బరువు వేరువేరు. ఇవికాక, ఆరు వేరియంట్ల బ్రహ్మోస్ క్షిపణులున్నాయి. ఇవన్నీ క్రూయిజ్ క్షిపణులు. మరో క్రూయిజ్ క్షిపణి నిర్భయకూడా ఇండియా వద్ద ఉంది. ఇవికాక జలాంతర్గాముల నుంచి ప్రయోగించే మరో రెండు బాలిస్టిక్ క్షిపణులు ఇండియా క్షిపణి ఆయుధాగారంలో ఉన్నాయి. యుద్దానికి సిద్ధం అంటే .. ఏ సమయంలో అయినా దేశం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని సైన్యాధికారులు చెప్తూ ..సర్వం సన్నధం చేస్తున్నారు. అయితే భారతదేశం అభిమతం మాత్రం ముందు శాంతి మార్గమే.