Begin typing your search above and press return to search.
ఇండియాలో బంగారం ఇంతేనా?
By: Tupaki Desk | 8 Aug 2015 9:10 AM GMTబంగారం అంటే ఇండియన్లు ఎంతో మోజు పడతారు... ఇండియన్ల వద్ద బంగారం ఎంతో ఉందనీ అనుకుంటారు.. ఇండియాలో ప్రజల వద్ద ఉన్న బంగారం లెక్కెంతే కరెక్టుగా చెప్పలేకపోయినా ప్రభుత్వం వద్ద ఉన్న బంగారం ప్రపంచంలోని పలు దేశాలతో పోల్చి చూస్తే బాగా తక్కువ. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన ర్యాంకిగ్సు ప్రకారం ఇండియా ప్రపచంలో 11 వ స్థానంలో ఉన్నప్పటికీ బంగారం నిల్వల పరంగా చూస్తే మాత్రం చాలా వ్యత్యాసం ఉంది.
2015 ఫిబ్రవరి వరకు తీసుకున్న లెక్కల ప్రకారం ఏదేశం వద్ద ఎంత బంగారం ఉందన్న వివరాలు అధికారికంగా విడుదల చేశారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన ఈ నివేదికలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. అమెరికా వద్ద 8,133.5 టన్నులు బంగారం ఉండగా 11 వ స్థానంలో ఉన్న ఇండియా వద్ద 765.2 టన్నుల బంగారం మాత్రమే ఉంది. ఈ జాబితాలో అమెరికా తరువాత స్థానల్లో వరుసగా జర్మనీ, ఇంటర్నేషనల్ మోనటరింగ్ ఫండ్(దేశం కాదు), ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఆ తరువాత స్థానంలో ఇండియా ఉంది.