Begin typing your search above and press return to search.

డేంజర్: దేశంలో సామూహిక వ్యాప్తి దశ ప్రారంభం?

By:  Tupaki Desk   |   20 May 2020 1:30 AM GMT
డేంజర్: దేశంలో సామూహిక వ్యాప్తి దశ ప్రారంభం?
X
130 కోట్ల జనాభా.. ఇప్పటికీ లక్ష కేసులు.. ఇప్పుడు దేశమంతా ఫ్రీ అయ్యింది. అందరూ ఉద్యోగ, వ్యాపారాలు మొదలు పెట్టారు. ఈరోజు నుంచి దేశం తిరిగి మామూలు స్థితికి రాబోతోంది. మరి అంత నిర్భంధం లోనే లక్ష కేసులు దాటి విస్తృతంగా వ్యాపించిన కరోనా.. ఇప్పుడు జనాలంతా రోడ్డెక్కిన వేళ ఎంతటి ఉపద్రవం తీసుకొస్తుందోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది.

ఈ అనుమానాలకు బలం చేకూరేలా కేంద్రంలోని కీలకమైన ‘నీతి అయోగ్’ బాంబు పేల్చింది. దేశంలో మహమ్మారి సామూహిక వ్యాప్తి దశలో ఉందని సంచలన ప్రకటన చేసింది. ఈ పరిస్థితి దేశానికి సవాల్ గా మారిందని పేర్కొంది. దీంతో ఒక నుంచి ఆ మహమ్మారి ఎటు నుంచి ఎవరికి సోకుతుందని తెలియదు. సామూహికంగా జనాలందరికీ సోకే ప్రమాదంలోకి దశ చేరింది. 130 కోట్ల మంది ఉన్న దేశంలో ఇది చేయిదాటితే మాటలకందని పెను వినాశనమేనని నీతి అయోగ్ హెచ్చరిస్తోంది.

ఈ నేపథ్యంలోనే దేశంలో కరోనా పరిస్థితిపై.. దానిని ఎదుర్కోవడంలో మన దేశానికి ఉన్న బలాలు.. బలహీనతలు.. అవకాశాలు.. సవాళ్లపై నీతి అయోగ్ తాజాగా ఒక అధ్యయన నివేదికను విడుదల చేసింది.

అందరూ ఈ సామూహిక వ్యాప్తి దశలో వ్యాధి కట్టడికి భౌతిక దూరాన్ని పాటించాలని నీతి అయోగ్ కోరింది. కానీ ఇప్పటికీ అమలులో ఉల్లంఘనలు జరిగాయని నీతి అయోగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వారిని వెతికి పట్టుకోవడం లో వైఫల్యం ఉందని.. అదే కేసులు పెరగడానికి కారణమైందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సామూహిక వ్యాప్తికి దారితీసే ప్రమాదం ఉందని తెలిపింది.

+ నీతి అయోగ్ నివేదికలో మహమ్మారి వ్యాప్తికి సూచనలు ఇవీ..
*మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
*కేసులను పర్యవేక్షించడం కోసం గ్రామీణ స్థాయిలో పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయాలి
*మహమ్మారిపై పోరుకు వినూత్న పరిష్కారాలు అందించడానికి స్టార్టప్ లు, ఎంఎస్ఎంఈలు, కార్పొరేట్, పరిశోధన విద్యాసంస్థలు ముందుకు రావాలి.
*విద్యాసంస్థలు నడిపించడం.. కార్యాలయాల్లో పనుల నిర్వహణకు వీడియో కాన్ఫరెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి.