Begin typing your search above and press return to search.

టాప్-5 లోకి దూసుకెళ్లిన భార‌త్‌: ‌కొత్త‌గా 9,971 పాజిటివ్‌ - 287 మృతి

By:  Tupaki Desk   |   7 Jun 2020 6:03 AM GMT
టాప్-5 లోకి దూసుకెళ్లిన భార‌త్‌: ‌కొత్త‌గా 9,971 పాజిటివ్‌ - 287 మృతి
X
మ‌హ‌మ్మారి వైర‌స్ విష‌యంలో భార‌త‌దేశం రికార్డులు సృష్టిస్తోంది. అభివృద్ధి, సంక్షేమంలో టాప్‌ లో నిల‌వ‌కున్నా వైర‌స్ విష‌యంలో మాత్రం ప్ర‌పంచ దేశాల‌తో పోటీ ప‌డి నంబ‌ర్ స్థానానికి ఎగ‌బాకేలా ఉంది. తాజాగా ఒక్క‌రోజే దాదాపు ప‌దివేల‌కు చేరువ‌గా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 24 గంట‌ల్లో 9,971 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌ శాఖ ఆదివారం ప్ర‌క‌టించింది. ఒక్క‌రోజులో 287 మృతి చెందారు. తాజా వాటి‌తో క‌లిపి మొత్తం కేసులు 2,46,628కి చేరుకోగా - మొత్తం మరణాలు 6,929కి చేరాయి. తాజా కేసుల‌తో ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచంలో ఐదో స్థానానికి భారత్ చేరుకుంది. స్పెయిన్‌ ను దాటేసి ఒక‌డుగు పైకి ఎక్కింది. కేసుల విష‌యంలో త్వ‌ర‌లోనే అమెరికా స‌ర‌స‌న చేరేలా ప‌రిస్థితి ఉంది.

వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1,19,293గా ఉంది. ప్రస్తుతం దేశంలో 1,20,406 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన టెస్టుల సంఖ్య 46,66,386గా ఉందని కుటుంబ సంక్షేమ శాఖ వెల్ల‌డించింది.

ప్రపంచవ్యాప్తంగా వైర‌స్ కేసులు 69,74,721కి చేరుకున్నాయి. వీటిలో యాక్టివ్‌ కేసులు 31,61,346 ఉన్నాయి. మృతులు 4,02,094 మంది ఉన్నారు.

కేసుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా టాప్‌ లో ఉన్న దేశాలు

అమెరికా 19,88,544
బ్రెజిల్ 676,494
ర‌ష్యా 458,689
స్పెయిన్ 2,88,390
లండ‌న్ (యూకే) 2,84,868