Begin typing your search above and press return to search.
ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో టాప్ గేర్‌లో భారత్
By: Tupaki Desk | 24 Oct 2019 5:45 AM GMTఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న తొమ్మిది దేశాల టెస్ట్ చాంపియన్‌షిప్ లీగ్‌లో ప్రపంచ నెంబర్ వన్ జట్టు భారత్ ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లను బట్టి చూస్తే లీగ్‌లో టాపర్‌గా నిలిచింది. ఐసీసీ తొలిసారిగా 9 టెస్ట్ దేశాల మధ్య (అప్ఘనిస్తాన్ మినహాయించి) నిర్వహిస్తోన్న ఈ లీగ్‌లో ప్రతి సీరిస్‌కు 120 పాయింట్లు కేటాయిస్తోంది. ఆ సీరీస్‌లో జరిగే మ్యాచ్‌లను బట్టి ఆ 120 పాయింట్లను డివైడ్ చేస్తారు. రెండు మ్యాచ్‌లు జరిగితే మ్యాచ్‌కు 60 పాయింట్లు... మూడు మ్యాచ్‌లు అయితే మ్యాచ్‌కు 40 పాయింట్లు... నాలుగు మ్యాచ్‌లు అయితే మ్యాచ్‌కు 30 పాయింట్లు కేటాయిస్తారు.
ఈ లెక్కన ఇప్పటి వరకు జరిగిన రెండు సీరిస్‌లలోనూ మొత్తం ఐదు మ్యాచ్‌లు గెలిచిన భారత్ మొత్తం 240 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో లీగ్ టాపర్‌గా ఎవ్వరికి అందనంత ఎత్తులో నిలిచింది. ఈ చాంపియన్ షిప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో వెస్టిండిస్‌ను 2-0తో చిత్తు చేసిన భారత్ తాజాగా దక్షిణాఫ్రికాను 3-0తో ఓడించింది. దీంతో ఐదు విజయాలతో మొత్తం 240 పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది.
ఇక వరుస విజయాలతో మాంచి జోరు మీదున్న భారత్ వచ్చే నెల నుంచి బంగ్లాదేశ్‌తో రెంటు టెస్ట్ మ్యాచ్‌ల సీరిస్‌లో తలపడనుంది. ఆ సీరిస్ కూడా క్వీన్‌స్వీప్ చేస్తే భారత్ ఖాతాలో మరో 120 పాయింట్లు యాడ్ అయ్యి మొత్తం 360 పాయింట్లు చేరతాయి. ఈ చాంపియన్ షిప్ లీగ్‌లో భారత్‌కు దరిదాపుల్లో కూడా ఏ జట్టు లేదు. ఇక తాజాగా దక్షిణాఫ్రికా మూడో ర్యాంకులో ఉండి కూడా భారత్‌కు పోటీ ఇవ్వకపోవడంతో తర్వాత సీరిస్‌లో బంగ్లాదేశ్ నుంచి కూడా ఎలాంటి ప్రతిఘటనా ఉంటుందని ఆశించలేం. రెండు సంవత్సరాల తర్వాత లీగ్‌లో టాప్ రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.