Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ లో భారతీయులు ఇంత డేటా వాడారా?
By: Tupaki Desk | 21 April 2020 2:30 AM GMTదేశమంతా లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమయ్యారు. మరి 130 కోట్ల మంది భారతీయుల వ్యాపకం ఏందీ? టీవీలు చూస్తూ కుటుంబంతో గడుపుతూ సరదాగా ఉంటున్నారు. అయితే ఈ ఖాళీ టైంలో మనోళ్లు విపరీతంగా ఇంటర్నెట్ డేటా వాడేస్తున్నారు. ఫోన్లు, ల్యాప్ టాప్, కంప్యూటర్లలో తెగ ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారు.
లాక్ డౌన్ వేళ దేశవ్యాప్తంగా ఏకంగా దాదాపు 308000 టెరా బైట్స్ (టీబీలు) డేటాను వినియోగించినట్టు తాజాగా టెలికాం డేటా వెల్లడించింది. ఇంత డేటా వాడటం ఓ రికార్డుగా అభివర్ణిస్తున్నారు.
దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన మార్చి 25 నుంచి ఇంటర్నెట్ ను దేశంలో భారీగా వినియోగించినట్టు టెలీకమ్యూనికేషన్స్ శాఖ వెల్లడించింది. మార్చి 22 నుంచి మార్చి 28మధ్య భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారులు ఏకంగా 307963 టీబీల డేటా వాడినట్టు తెలిపారు.
ఇక ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగినట్టు గణంకాలు తెలిపాయి. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధిక డేటా వినియోగించారు. అమేజాన్ ప్రైమ్ సహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా సినిమాలు చూసినట్టు వెల్లడించారు. ఫోన్లు, కంప్యూటర్లలోనూ తెగ ఇంటర్నెట్ ను వాడేశారని తెలిపాయి.