Begin typing your search above and press return to search.

క్వారంటైన్‌ విషయంలో చైనా కంటే ఇండియానే బెటర్!

By:  Tupaki Desk   |   4 Dec 2022 10:34 AM GMT
క్వారంటైన్‌ విషయంలో చైనా కంటే ఇండియానే బెటర్!
X
కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనా దేశం ఇప్పుడు ఆ మహమ్మారి ధాటికి చిగురుటాకులా వణుకుతోంది. చైనాలోనే అతిపెద్ద నగరాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో పరిస్థితులు భయానకంగా తయారవుతున్నాయి. జీరో కోవిడ్ విధానంలో భాగంగా చైనా ప్రభుత్వం అక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. కరోనా వస్తే చాలు క్వారంటైన్లు,, లాక్ డౌన్ లు విధిస్తూ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది.

దీంతో చైనా ప్రజలు కనీసం ఆహారం తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేకుండా ఆంక్షలు అమలు చేస్తోంది. ఆహారం లేక.. అందించేవారు లేక ప్రజలు ఆకలితో అలమటిస్తూ చనిపోవడం కంటే ఆత్మహత్య శరణ్యమంటూ ఆక్రందనలు చేస్దున్నారు. కనీసం జైలుకెళితే అయినా కడుపు నిండుతుందనే ఆశతో తమను అరెస్ట్ చేయండంటూ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇక మరీ దారుణం ఏంటంటే.. కరోనా బారినపడిన వారి ఇళ్లలోని పెంపుడు జంతువులను సిబ్బంది కొట్టిచంపుతున్నారు. ఇటువంటి దారుణాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రుల్లో అరకొర వసతులు.. చెత్తాచెదారంతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెబుతున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

షాంఘైలో భారీగా కరోనా కేసులు వెలుగులోకి వస్తుండడంతో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో నిత్యావసర వస్తువులు లభించక.. ఆహారం దొరక్క లక్షలాది మంది ప్రజలు అల్లాడుతున్నారు.

ఇళ్లలోని బాల్కనీలు, కిటికీల్లోంచి అరుపులు, పాటలతో నిరసన తెలుపుతున్నారు. మమ్మల్ని కాపాడండి.. ఆకలితో బతకడం కష్టంగా ఉంది అంటూ అధికారులను వేడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇక అధికారులు సరఫరా చేస్తున్న ఆహార వస్తువులు చాలక మార్కెట్లను లూటీ చేస్తున్న ఘటనలు ఇటీవల చైనాలో పెరిగిపోయాయి.

తాజాగా ఓ వ్యక్తి క్వారంటైన్ కు నిరాకరించడంతో బలవంతంగా అతడిని తీసుకెళుతున్న వీడియో వైరల్ అవుతోంది. వీడియోలోని వ్యక్తులు క్వారంటైన్ కు ఎంత వ్యతిరేకించినా సిబ్బంది వాళ్లను ఈడ్చుకుంటూ తీసుకెళుతున్నారు. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ క్వారంటైన్ విషయంలో ఇండియానే బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.