Begin typing your search above and press return to search.
చైనాను ఈ విషయంలో దాటేయనున్న భారత్
By: Tupaki Desk | 19 Jun 2019 10:38 AM GMTప్రపంచంలోనే ఇప్పుడు అత్యధిక జనాభా గల దేశం చైనా.. 2019 లెక్కల ప్రకారం 1.43 బిలియన్ల మంది ప్రజలు ఆ దేశంలో ఉన్నారు. అంటే దాదాపు 143 కోట్ల మంది ప్రజలున్నారన్న మాట.. అయితే ఇండియా జనాభా వృద్ధి చూస్తుంటే చైనాను దాటేయడం ఖాయమంటున్నారు. అయితే 2027 వరకు చైనా జనాభాను భారత్ దాటేస్తుందని తాజాగా ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2019-2050మధ్య భారత్ లో మరో 27.3 కోట్ల జనాభా పెరుగనుందని తాజాగా విడుదల చేసిన ప్రపంచ జనాభా రిపోర్టులో వెల్లడైంది.
ప్రస్తుతం ప్రపంచం జనాభా 770 కోట్లుగా ఉంది. 2050 నాటికి 970 కోట్లకు చేరుకోనుంది. 2050వరకు ప్రపంచ జనాభాలో సగానికి పైగా కేవలం తొమ్మిది దేశాల్లోనే పెరగనుందని నివేదిక వెల్లడించింది. భారత్- పాకిస్తాన్- నైజిరియా- ఇథియోపియా- టాంజానియా- ఇండోనేషియా- ఈజీప్టు- అమెరికా- కాంగోలలో అత్యధికంగా జనాభా పెరుగుదల ఉంటుందని తెలిపింది.
ప్రస్తుతం 143 కోట్ల జనాభాతో చైనా ఇప్పుడు ప్రపంచంలోనే జనాభాలో అగ్రస్థానంలో ఉంది. ఇక 137 కోట్ల జనాభాతో భారత్ జనాభాలో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో ఈ రెండు దేశాల వారు 19శాతంగా చైనీయులు, 18శాతంగా భారతీయులున్నారు.
ఇక అమెరికాలో కూడా జనాభా పెరిగిపోతుందని నివేదిక తేల్చింది. అమెరికాలోని ప్రవాస భారతీయుల జనాభా కూడా పెరిగిపోతుందని సంస్థ వెల్లడించింది. 2010-17 మధ్య 38శాతం పెరిగిందని.. 2017లో 44 లక్షలకు పైగా జనాభా పెరిగినట్లు తెలిసింది. అమెరికా మొత్తంలో దక్షిణాసియా వారే 40శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.