Begin typing your search above and press return to search.
డిజిటల్ గా దూసుకుపోతున్న భారత్.. ఈ గంగిరెద్దే సాక్ష్యం?
By: Tupaki Desk | 6 Nov 2021 3:43 AM GMTడిజిటల్ చెల్లింపుల విషయంలో భారతదేశం దూసుకుపోతోంది. కొన్నేళ్ల నుంచి ఈ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం ఇడ్లీ తిన్నా... పానీపూరీ తిన్నా కూడా ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లింపులు జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వినియోగం, పెరిగిన డేటా వాడకంతో ఫైవ్ స్టార్ హోటల్ నుంచి పాన్ షాపు బండి వరకు డిజిటల్ పేమెంట్స్ హవా సాగుతోంది. ఈ చెల్లింపులు కేవలం నగరాలు, మెట్రో సిటీలకే పరిమితం కాకుండా పల్లెలకూ విస్తరించాయి. గ్రామాల్లోనూ ఈ డిజిటల్ చెల్లింపులు కొనసాగుతున్నాయి. దేశంలో ఈ చెల్లింపులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి సంభందించిన ఓ వీడియోను కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ షేర్ చేశారు. దేశంలో డిజిటల్ చెల్లింపులను గురించి తెలిపే దృశ్యాలను ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. అయితే డిజిటల్ గా దూసుకుపోతున్న భారత్ కు ఈ వీడియోనే సాక్ష్యమని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇందులో ఏం ఉందంటే.. గంగిరెద్దు. అయితే గంగిరెద్దుకు, డిజిటల్ భారత్ కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా..! అయితే ఉన్నదంతా కూడా ఈ గంగిరెద్దు తలపైనే.
ఈ వీడియోలో కనిపిస్తున్న గంగిరెద్దు తలపై ఓ క్యూఆర్ కోడ్ అమర్చి ఉంది. అందులో ఓ వ్యక్తి దానిని స్కాన్ చేసి.. గంగిరెద్దులు ఆడించే వ్యక్తికి భిక్షాటన చెల్లిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్... భారత్ డిజిటల్ చెల్లింపుల అంశం జానపద కళాకారుల వరకు చేరిందని కేంద్రమంత్రి ట్వీట్ చేశారు. డిజిటల్ గా భారత్ దూసుకుపోతోందని ఆమె పేర్కొన్నారు.
'ఇది రికార్డెడ్ వీడియో. గంగిరెద్దుల తలపై క్యూఆర్ కోడ్ అమర్చి ఉంది. డిజిటల్ చెల్లింపుల ద్వారా భిక్షాటన చేస్తున్నారు ఈ జానపద కళాకారులు. భారత డిజిటల్ పేమెంట్స్ విప్లవం పల్లెల్లోని జానపద కళాకారుల వరకు చేరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గంగిరెద్దులను ఇలా అలంకరించి ఆటలాడిస్తారు. పాతబట్టలతో వాటిని అలంకరించి పండుగ వేళా ఇంటింటికి తిరుగుతూ నాదస్వరం ఊదుతూ భిక్షాటన చేస్తారు.'
-నిర్మలా సీతారామన్, కేంద్రఆర్థిక మంత్రి
కేంద్రమంత్రి షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్ దేశంలో డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. పది రూపాయల నుంచి రూ.లక్షల వరకు క్షణాల్లో ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం వచ్చిందని మరికొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ ఇండియాలో మరిన్ని పెను మార్పులు రావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పెరిగిన ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలా తగ్గించాలని వచ్చే కామెంట్స్ కొసమెరుపు. ఏది ఏమైనా డిజిటల్ పేమేంట్స్ విషయంలో భారత్ ఓ విప్లవం సృష్టించిందని చెప్పవచ్చు. పెరిగిన సాంకేతికత మెట్రో సిటీల నుంచి మారుమూల గ్రామాల వరకు చేరడం నిజంగా అభినందనీయమైన విషయమేనని నిపుణులు అంటున్నారు. భిక్షాటన చేస్తున్న వారు మొదలుకొని నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఉన్నతోగ్యులు, వ్యాపారస్తుల వరకు ఈ డిజిటల్ పేమెంట్స్ చేయడం గమనార్హం.

Recd a video of a Gangireddulata, where alms are given thru a QR code! India’s #digitalpayment revolution, reaching folk artists. In AP + Telangana, Gangireddulavallu dress up old oxen no longer helpful on farms, walk door to door during fests, performing with their nadaswarams pic.twitter.com/8rgAsRBP5v
— Nirmala Sitharaman (@nsitharaman) November 4, 2021