Begin typing your search above and press return to search.

ఆయుధాలను భారీగా మోహరిస్తున్న భారత్

By:  Tupaki Desk   |   28 Sept 2022 11:16 AM IST
ఆయుధాలను భారీగా మోహరిస్తున్న భారత్
X
సరిహద్దుల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్ధితుల్లో మన సైన్యం ఆయుధాలను సరిహద్దుల్లో భారీగా మోహరిస్తోంది. సరిహద్దుల్లో ఒకవైపు పాకిస్తాన్ మరోవైపు చైనా నుండి ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. పై రెండు దేశాలు ముఖ్యంగా కాశ్మీర్ లోయపైనే తమ దృష్టిని కేంద్రీకరించున్న విషయం అందరికీ తెలిసిందే. అవకాశం దొరికితే లేదా అవకాశాన్ని ఎలాగైనా దొరికించుకుని భారత్ భూభాగాన్ని ఆక్రమించుకోవటమే టార్గెట్ గా పెట్టుకున్నాయి.

సరిహద్దుల్లోకి శత్రుదేశాల సైన్యాలు చొచ్చుకురాకుండా చూసుకోవటమే మన సైన్యానికి పెద్ద సవాలుగా మారిపోయింది. ప్రతిరోజు వేల కిలోమీటర్ల సరిహద్దుల్లో ఎక్కడో ఒకచోట ఆక్రమణలు, ప్రతిఘటనలు జరుగుతునే ఉన్నాయి.

ఇదే సమయంలో చైనా కూడా ఆయుధాలను సరిహద్దుల్లో మోహరిస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే చైనా సరిహద్దుల్లో భారత్ సైన్యం భారీ ఎత్తున ఆయుధాలను మోహరించింది. మన సైన్యం మోహరించిన వాటిల్లో శతఘ్నులు, రాకెట్ వ్యవస్ధలు, యూఏవీలున్నాయి.

శతఘ్ని దళాలు ఇప్పటికే వజ్ర కే9, ధనుష్, తేలికపాటి ఎం 777 శతఘ్నులు, పినాక రాకెట్ వ్యవస్ధలను కూడా సరిహద్దులకు తరలించింది. ఇక యూఏవీలు 90 కిలోమీటర్ల పరిధి వరకు నిఘా వ్యవస్ధకు బాగా ఉపయోగపడతాయి.

లడ్డాఖ్ తూర్పుప్రాంతంలోని సరిహద్దుల్లో చైనా ఎక్కడైతే తన సైన్యాన్ని మోహరించేందుకు అవకాశాలున్నాయని అనుమానిస్తోందో అక్కడల్లా ఆయుధాలను మన సైన్యం ఏర్పాటుచేసింది. గతంలో కాశ్మీర్ లోయలోని లడ్డాఖ్ , గాల్వాన్ లోయలోను చైనా సైన్యం ఎంతటి దౌర్జన్యానికి పాల్పడింది ప్రపంచమంతా చూసింది.

అప్పట్లో జరిగిన డ్రాగన్ దాడులను మన సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టినా మరణాలు కూడా ఎక్కువగానే జరిగింది. దీన్ని నివారించంటంలో భాగంగానే ముందుజాగ్రత్తగా ప్రతి పాయింట్ లోను అవసరానికి మించి సైన్యాన్ని మన అధికారులు మోహరించారు. వీళ్ళకు మద్దతుగా పెద్దఎత్తున ఆయుధాలను కూడా అందుబాటులో ఉంచారు. కాబట్టి మన సరిహద్దుల్లోకి చొచ్చుకు రావడానికి డ్రాగన్ ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.