Begin typing your search above and press return to search.
అమెరికా తరువాత ఇండియాలోనే ఎక్కువ టెస్టులు : వైట్ హౌస్ !
By: Tupaki Desk | 18 July 2020 12:10 PM GMTప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే అక్కడ 37 లక్షల మంది కరోనా భారిన పడ్డారు. అయితే , అమెరికాలో ఎక్కువ టెస్టులు చేయడం వల్లే కరోనా కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి అని , మిగతా దేశాల్లో ఇదే లెవెల్ లో టెస్టులు చేస్తే అక్కడ కూడా ఇదే విధముగా కేసులు వెలుగులోకి వస్తాయి అని అమెరికా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా తర్వాత అత్యధిక కరోనా టెస్టులు భారత్లో నే నిర్వహించారని వైట్ హౌజ్ వెల్లడించింది.
తొలి స్థానంలో అమెరికా ఉన్నట్లు మరోసారి ప్రకటించింది. ఇప్పటివరకు అమెరికాలో 4కోట్ల 20లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. అమెరికా తరువాత అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలను భారత్ చేపడుతున్నట్లు అభిప్రాయపడింది. భారత్‌లో ఇప్పటి వరకు కోటి 20లక్షల మందికి పరీక్షలు పూర్తిచేసినట్టు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కెలీగ్ మెక్‌ఎనాని మీడియా సమావేశంలో వెల్లడించారు. యూఎస్‌లో ఇప్పటి వరకు 35లక్షల మందికి కరోనా పాజిటివ్ తేలగా, 1.38లక్షల మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రెటరీ కెలీ మెక్ఎనాని విలేకరులతో మాట్లాడారు.
ఇదివరకు హెచ్1ఎన్1 ఫ్లూ విజృంభించిన సమయంలో గత ప్రభుత్వాలు అవలంభించినట్లుగా తాము ఈ టెస్టింగ్‌లను ఆపబోమని స్పష్టం చేశారు. బారక్ ఒబామా హయాంలో 2009లో హెచ్1ఎన్1 వైరస్ ఉద్ధృతమైనప్పుడు పరీక్షలను నిలిపివేయాలని రాష్ట్రాలకు ఆదేశించారని ఆమె ఆరోపించారు. మెక్‌ఎనాని చేసిన ఆరోపణలను మాజీ ఉపాధ్యక్షుడు బొడెన్ స్టాఫ్ చీఫ్ రోన్ క్లెయిన్ తిప్పికొట్టారు. ‘హెచ్1ఎన్1 అమెరికా చరిత్రలో సామూహిక ప్రమాద సంఘటనలో ఒకటి కాకపోవడం అదృష్టం.. నాటి పరిస్థితిని కరోనాతో పోల్చడానికి సంబంధం లేదు’ అన్నారు