Begin typing your search above and press return to search.

చైనాపై యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిన భారత్

By:  Tupaki Desk   |   22 Jun 2020 8:30 AM GMT
చైనాపై యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిన భారత్
X
సరిహద్దుల్లో మన సైనికులను చంపిన చైనాపై భారతదేశం వైఖరి పూర్తిగా మారిపోతోంది.ఇక చైనాతో ఎటువంటి సంబంధాలు ఉండరాదని డిసైడ్ అవుతోంది. దేశమంతా చైనా వస్తువులు, యాప్స్ నిషేధించాలన్న డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంది.

చైనాతో ఉద్రిక్తత నేపథ్యంలో ఓ వైపు యుద్ధానికి సిద్ధమవుతూనే చైనాను ఆర్థికంగా డెబ్బకొట్టడానికి చైనా వస్తువుల నిషేధం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే యుద్ధ సన్నాహాల కోసం 500 కోట్ల అత్యవసర నిధిని ఆయుధాల కొనుగోలుకు కేటాయిస్తూ భారత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా చైనా ఉత్పత్తుల జాబితాను సమర్పించాలంటూ ఇండియన్ కార్పొరేట్లకు ఆదేశాలను జారీ చేసింది.

ఇలా యుద్ధానికి సిద్ధమవుతూనే చైనా వస్తువుల నిషేధం దిశగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇప్పటికే సరిహద్దు దేశాలన్నింటిని గుప్పిట పట్టి భారత్ కు వ్యతిరేకంగా తయారు చేస్తున్న చైనాకు తలొగ్గకూడదని.. దానిని ధైర్యంగా ఎదురించాలని భారత ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

తాజాగా తీసిన లెక్కల ప్రకారం.. చైనా నుంచి భారత్ కు 14శాతం దిగుమతుల వాటా ఉంది. మొబైల్స్, టెలికాం, పవర్, ప్లాస్టిక్ , ఫార్మా ముడిసరుకులను చైనా నుంచి భారత్ కు దిగుమతి అవుతున్నాయి. భారత ప్రభుత్వ ఆదేశాలతో ఈ జాబితాను అధికారులు రెడీ చేశారు. వీటన్నింటని వెంటనే దేశంలో ఉత్పత్తి చేయడానికి స్వావలంబన సాధించడానికి ప్రధాని కార్యాలయం కార్పొరేట్లతో కీలక సమావేశం నిర్వహించింది. ఈ పరిణామాలతో చైనా వస్తువుల బహిష్కరణ దిశగానే కేంద్రం అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.