Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ వచ్చింది సరే..! ఇండియాలో ఎప్పుడిస్తారు?
By: Tupaki Desk | 27 Dec 2020 8:30 AM GMTకరోనా వ్యాక్సిన్‌పై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అందరికంటే ముందే వ్యాక్సినేషన్ ప్రారంభించి రష్యా సంచలనం సృష్టించింది. అయితే అమెరికా, బ్రిటన్, కెనడా, ఇజ్రాయెల్ సహా మరికొన్ని దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించారు. అమెరికా తీసుకొచ్చిన ఫైజర్ వ్యాక్సిన్ మిగతా అన్ని వ్యాక్సిన్ల కంటే ప్రభావవంతంగా పనిచేస్తుందని టాక్. బ్రిటన్‌లో ఇప్పటికే ఆరులక్షల మందికి ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చినట్టు టాక్. అన్ని దేశాల్లో ముందుగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కే వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో మనదేశంలో వ్యాక్సిన్ ఎప్పుడు పంపిణీ చేస్తారన్న విషయం చర్చనీయాంశం అయ్యింది.
వ్యాక్సినేషన్ కోసం సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది కూడా. అయితే యూరప్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా వేగంగా సాగుతోంది. యూరోపియన్ యూనియన్‌లోని దాదాపు 10 దేశాలు ఫైజర్ వ్యాక్సిన్ డోసుల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. మరోవైపు మనదేశంలోకి ఫైజర్ వ్యాక్సిన్ తీసుకురావడం సాధ్యపడకపోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ఓ నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద భద్రపరచవలసి ఉంటుంది. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే ఫైజర్ వ్యాక్సిన్‌తో పాటు సనోఫీ-గ్లాక్సోస్మిత్‌క్లైన్, ఆస్ట్రాజెనెకా, జన్‌సెన్ ఫార్మాసూటికా ఎన్‌వీ, క్యూర్ వ్యాక్, మోడెర్నా వ్యాక్సిన్లు కూడా అనుమతుల కోసం వేచిచూస్తున్నాయి.
మనదేశంలో భారత్‌బయోటెక్ కోవాక్జిన్‌ను సీరం ఇన్స్టిట్యూట్ మరో వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. దీంతో పాటు రష్యా తయారుచేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ను మనదేశంలో రెడ్డి ల్యాబ్స్ అందుబాటులోకి తేనున్నది. వీటి క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాక మనదేశంలోనూ వ్యాక్సినేషన్ మొదలుపెట్టే అవకాశం ఉన్నది. వ్యాక్సిన్ పంపిణీ ఇంకా పూర్తికాకముందే ... యూకేలో కొత్త స్ట్రెయిన్ కలకలం పుట్టిస్తున్నది. వ్యాక్సిన్లు ఈ జన్యుమార్పిడి చెందిన కరోనా వైరస్‌ను ఎదుర్కొగలవా లేదా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో మనదేశంలో వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వేచి చూడాలి.