Begin typing your search above and press return to search.
మోడీ చేసుకున్న అణు ఒప్పందం ఏంది?
By: Tupaki Desk | 12 Nov 2016 4:50 AM GMTపెద్దనోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని మోడీ.. తన మాటను చెప్పేసిన తర్వాత ఏం చేశారన్నది చూస్తే.. ఆయన జపాన్ పర్యటనకు వెళ్లిపోయారు. పెద్దనోట్ల రద్దు షాక్ తో దేశ ప్రజలు కిందామీదా పడుతూ.. చిల్లర నోట్ల కోసం అవస్థలు పడుతున్న వేళ.. మోడీ జపాన్ లో పర్యటిస్తూ.. ఆ దేశంతో కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారు.
చారిత్రక అణు ఒప్పందంతో పాటు.. మరో 11 ఒప్పందాలు రెండు దేశాల మధ్య జరిగాయి. ప్రధాని మోడీకి.. జపాన్ ప్రధాని షింజో అబెతో జరిగిన అణు ఒప్పందానికి మాత్రం ఆ దేశ పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంటుంది. అది పూర్తి అయ్యాక.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణువిద్యుత్ కేంద్ర నిర్మాణం మరింత వేగం పుంజుకోనుంది.
చారిత్రక ఒప్పందంగా అభివర్ణిస్తున్న అణు ఒప్పందంతో మనకు కలిగే లాభం ఏమిటన్నది కీలక ప్రశ్న. దీనికి సమాధానం వెతికితే.. ఈ ఒప్పందం కారణంగా భారత్ కు ఏ విధంగా లాభమో ఇట్టే అర్థమవుతుంది. ఈ ఒప్పందం ప్రకారం జపాన్ నుంచి భారత్ కు న్యూక్లియర్ రియాక్టర్లు దిగుమతి చేసుకునే వీలు కలుగుతుంది. అదే సమయంలో అణు ఇంధనాన్ని.. అణు సాంకేతికతను భారత్ కు జపాన్ సరఫరా చేసే వెసులుబాటు కలుగుతుంది.
కొన్ని సంస్థలు భారత్ లోని ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో అణు విద్యుత్తు కేంద్రాల్ని నిర్మిస్తున్నాయి. తాజాగా జరిగిన ఒప్పందం కారణంగా అణు కేంద్రాల్ని నిర్మించేందుకు ఎదురవుతున్న ‘సమస్యలు’ తాజా ఒప్పందంతో పరిష్కారం కానున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విదేశాలకు ఆయుధాల్ని విక్రయించే అంశంపై గడిచిన50 ఏళ్లుగా నిషేధం ఉంది. దీన్ని తీసేసిన జపాన్ ప్రధాని.. మొదట ఒప్పందం చేసుకుంటున్న దేశం భారత్ కావటం గమనార్హం. ఇదిలా ఉంటే వివిధ దేశాలతో భారత్ అణు ఒప్పందాలు చేసుకుంటోంది. అలా ఒప్పందాలు చేసుకుంటున్న దేశాల్లో జపాన్ భారత్ కు 11 దేశం. తాజాగా చేసుకున్న కీలక అణు ఒప్పందం అణు విద్యుత్తు కేంద్రాల నిర్మాణాన్ని వేగవంతం చేయటమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ సమస్యకు పరిష్కారం దొరికేలా చేస్తుందన్న అభిప్రాయాలు ఉన్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/