Begin typing your search above and press return to search.

మోడీ చెప్పిన 21 రోజల దీక్ష పొడిగించే అవకాశం లేదట

By:  Tupaki Desk   |   30 March 2020 7:15 AM GMT
మోడీ చెప్పిన 21 రోజల దీక్ష పొడిగించే అవకాశం లేదట
X
ఇప్పుడు నడుస్తున్నదంతా కరోనాదే. ఇప్పుడు ఎక్కడ చూసినా దాని గురించి మాటలే నడుస్తున్నాయి. అది కూడా ఒక రాష్ట్రం.. దేశం కాదు యావత్ ప్రపంచం ఇప్పుడు దాని గురించే మాట్లాడుతోంది. ఇదిలా ఉంటే.. కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేసేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించారు దీంతో.. యావత్ దేశం స్తంభించిపోయింది.

అదే సమయంలో కరోనా వ్యాప్తికి సంబంధించి పెద్ద చెక్ పాయింట్ లాక్ డౌన్ పుణ్యమా అని చోటు చేసుకున్నట్లైంది. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకునే పరిణామాల నేపథ్యంలో చాలామంది లాక్ డౌన్ ను మరిన్ని వారాల పాటుకొనసాగే అవకాశం ఉందన్న అంచనాలు వేస్తున్నారు. దీనికి సంబంధించిన మెసేజ్ లు.. వాట్సాప్.. ఫేస్ బుక్ పోస్టుల ద్వారా వైరల్ అవుతున్నాయి.

దీంతో.. బలహీన వర్గాలు..రోజువారీ ఉపాధి మీద ఆధారపడే వారితోపాటు చిరు వ్యాపారుల్లో కొత్త భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇలాంటివేళ.. ఈ ప్రచారానికి తెర దించేలా కీలక ప్రకటన చేసింది. కరోనాను కంట్రోల్ చేయటానికి వీలుగా ఇప్పడు అమల్లో ఉన్న లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. మీడియాతో పాటు.. సోసల్ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమని.. అందులో నిజం లేవని స్పష్టం చేసింది.

లాక్ డౌన్ ను పొడిగించే యోచన కేంద్రానికి లేదని పేర్కొంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించటం.. అయినప్పటికీ కొత్త కేసులునమోదు అవుతున్న వేళ.. పొడిగింపు ఖాయమన్న వాదనలు జోరందుకున్నాయి. ఇలాంటివేళ.. కేంద్రం పొడిగింపు ఆలోచన లేదన్న ప్రకటనను విడుదల చేసింది. ఇదిలా ఉంటే.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1071కు చేరుకుంటే.. ఇప్పటికి 29 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. లాక్ డౌన్ విధించటానికి ముందుకు.. ఆ తర్వాతను పోల్చి చూసినప్పుడు.. పాజిటివ్ కేసుల తీవ్రత కాస్త తగ్గిందనే చెప్పాలి.