Begin typing your search above and press return to search.

దేశంలోని అతిపొడ‌వైన స్మార్ట్ స్ట్రీట్ మ‌న‌దే!

By:  Tupaki Desk   |   1 Feb 2018 9:15 AM GMT
దేశంలోని అతిపొడ‌వైన స్మార్ట్ స్ట్రీట్ మ‌న‌దే!
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ను టెక్నాల‌జీ సాయంతో స్మార్ట్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు స‌ర్కార్ ప్ర‌య‌త్నిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్లుగానే విజ‌యవాడ‌లోని ఎంజీ రోడ్ ను `ది గోల్డెన్ మైల్ `పేరుతో డెవ‌ల‌ప్ చేసేందుకు 2015లోనే ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేసింది. దాదాపు 3 కిలోమీట‌ర్ల మేర ఎంజీ రోడ్ ను అత్యాధునిక స‌దుపాయాల‌తో రంగ‌రించ‌నుంది. ఈ అధునాత‌న ప్రాజెక్టుకు సిస్కో సాయం అందించ‌నుంది. `ది గోల్డెన్ మైల్` స్టార్ట్ స్ట్రీట్ రూప కల్ప‌న కోసం ఏపీ ప్ర‌భుత్వం -సిస్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. భార‌త దేశంలోనే అతి పొడ‌వైన స్మార్ట్ స్ట్రీట్ గా `ది గోల్డెన్ మైల్` ప్ర‌సిద్ధికెక్క‌నుంది.

ఈ `ది గోల్డెన్ మైల్`(ఎంజీ రోడ్)లో ప్ర‌యాణించే వారికి స‌క‌ల `స్మార్ట్` స‌దుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఈ వీధి మొత్తం దాదాపు 100 సీసీటీవీ స‌ర్వేలైన్స్ కెమెరాల నిఘాలో ఉంటుంది. దాదాపు 35 వైఫై హాట్ స్పాట్ లు, హై స్పీడ్ ఇంట‌ర్నెట్, వంద‌ల కొద్దీ స్మార్ట్ లైట్ లు ఈ స్ట్రీట్ ప్ర‌త్యేక‌త‌లు. ఆ వీధిలో ట్రాఫిక్ -పార్కింగ్ - వాతావ‌ర‌ణం త‌దిత‌ర వివ‌రాల‌ను ప్ర‌యాణికులు సులువుగా తెలుసుకునేందుకు వీలుంటుంది. ఆ వీధిలో 24 గంట‌లు స‌ర్వేలైన్స్ కెమెరాలు గ‌స్తీ కాస్తుంటాయి. 2030 క‌ల్లా భార‌త దేశంలోని న‌గ‌రాల‌ను స్మార్ట్ సిటీలుగా చేయాల‌న్న కేంద్రం...ఆ దిశ‌గా కొన్ని న‌గ‌రాల‌ను ఎంపిక చేసుకున్న సంగ‌తి తెలిసిందే.