Begin typing your search above and press return to search.

టీట్వంటీలో టీమిండియా అరుదైన రికార్డు

By:  Tupaki Desk   |   29 Jun 2018 11:27 AM GMT
టీట్వంటీలో టీమిండియా అరుదైన రికార్డు
X
ప్రస్తుతం టీమిండియా ఐర్లండ్ పర్యటనలో ఉంది. ఇప్పటికే ఆ దేశంతో ఓ టీట్వంటీ ఆడింది. అందులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ ద్వారా టీమిండియా 100 టీట్వంటీ మ్యాచ్ లను ఆడిన జట్టుగా నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్ లో 100వ టీ20 ఆడిన ఏడో జట్టుగా టీమిండియా నిలిచింది. ఐర్లాండ్ తో ఆడిన 100వ టీ20లో 76 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే..

100 టీట్వంటీలు ఆడి అందులో 63 విజయాలను సాధించి అత్యధిక విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా అరుదైన రికార్డును నెలకొల్పింది. టీమిండియా తర్వాత ఈ జాబితాలో వరుసగా దక్షిణాఫ్రియా (59) - పాకిస్తాన్ (59) - శ్రీలంక (52) - న్యూజిలాండ్ (52) - ఇంగ్లండ్ (48) జట్లు నిలిచాయి.

ఐర్లాండ్ తో జరిగిన తొలి టీట్వంటీలో ఓపెనర్లు శిఖర్ - రోహిత్ లు కలిసి తొలి వికెట్ కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐర్లండ్ జట్టుపై ఓ జట్టు నెలకొల్పిన అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. అదే సమయంలో ఈ భారత ఓపెనింగ్ జోడి మరో రికార్డును నమోదు చేసింది. టీట్వంటీలో 1000కి పైగా పరుగులు నమోదు చేసిన రెండో ఓపెనింగ్ జోడీగా నిలిచింది. అంతకుముందు వార్నర్-షేన్ వాట్సన్ ఇద్దరూ కలిసి ఓపెనర్లుగా 1000 పరుగులు చేశారు. వీరిద్దరూ 32 ఇన్సింగ్స్ లలో ఈ ఘనత సాధించగా.. ధావన్-రోహిత్ లు 34 ఇన్నింగ్స్ లో 1103 పరుగులతో రెండో స్థానంలో నిలిచారు