Begin typing your search above and press return to search.
సిగ్గుసిగ్గు: డిఫెండింగ్ ఛాంప్ టీం ఇదేనా?
By: Tupaki Desk | 20 Jan 2015 4:30 PM GMTక్రికెట్ ఇంగ్లాండ్ దేశంలో పుట్టింది, వారి జాతీయ క్రీడగా మారింది! ఆస్ట్రేలియా లో కూడా క్రికెట్ జాతీయక్రీడే! అయితేనేం... ఆ రెండు దేశాలకంటే, ప్రపంచ దేశాలకంటే క్రికెట్ ను ఎక్కువగా అభిమానించే దేశం భారతదేశం అంటే అతిశయోక్తి కాదు! అటువంటి దేశానికి సంబంధించిన ప్రపంచ కప్ టీం ప్రస్తుతం నికృష్టమైన స్థాయిలో పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది! ప్రపంచ కప్ కి ఇంక మూడు వారాల గడువు మాత్రమే ఉండటంతో భారత్ ఆటగాళ్ల ప్రదర్శన అభిమానులకు కంగారు పుట్టిస్తోంది! టెస్ట్ సిరీస్ అంటే... సరేలే పాపం అంతా జూనియర్స్ ఎక్కువగా ఉన్నారు, వాళ్ల స్థాయిలో ఇది బెస్ట్ ఫెర్మార్మెన్సే అని సర్ధిచెప్పుకున్నాడు సగటు భారత క్రికెట్ అభిమాని!
ప్రపంచ కప్ జరగబోయే వేదికలపై జరుగుతోన్న వన్ డే క్రికెట్ లో కూడా మన ఆటగాళ్ల పద్దతి ఏం మారలేదు! అదే ఆటతీరు, అదే ప్రదర్శన, అదే పట్టుదల... ఏమీ మారలేదు! నిన్నటి వరకూ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడి ఫెయిల్ అయిన టీం ఇండియా ఆట తీరు వన్ డే లో కూడా ఏమీ మారలేదు, డ్రెస్ కలర్ మారింది తప్ప అదే ప్రదర్శన కొనసాగుతోంది! కనీసం 50 ఓవర్లు కూడా ఆడలేని పరిస్థితిలో భారత్ బ్యాటింగ్ లైనప్ ఉంది! సాధారణంగా చెప్పుకునేది ఏమిటంటే... భారత్ బలం బ్యాటింగ్ అని... బౌలింగ్ లో కాస్త వీక్ అని! అయితే ఇప్పుడు బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్ లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది! 150 పరుగులకే ఆలౌట్ అయిపోయారంటే... అది బౌలింగ్ పిచ్చేమో, మనవాళ్లు కూడా ఇలానే బౌలింగ్ చేస్తారని కాస్త దైర్యం చెప్పుకునాడు సగటు అభిమాని! ఆ దైర్యం ఎక్కువ సేపు నిలబడకుండానే కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఇంకా 20 పైగా ఓవర్లు ఉండగానే పని పూర్తిచేసేసింది ఇంగ్లండ్!
ఈ పరిస్థితి మారాలి, ప్రపంచ కప్ క్రికెట్ టీమ్‌లలో ఫేవరెట్ టీం ఇండియా అని ప్రపంచం మొత్తం చెప్పే పరిస్థితి! ఈ సమయంలో టీం ఇండియా ఆటగాళ్ల నుండి ఇటువంటి ప్రదర్శన ఎవ్వరూ ఊహించనిది, ఆశించనిది అని గుర్తించాలని కోరుకుంటున్నాడు సగటు భారత క్రికెట్ అభిమాని!