Begin typing your search above and press return to search.

‘బల్ల కింద చేయి’లో భారత్‌‌దే పై చేయి

By:  Tupaki Desk   |   2 Sep 2017 2:47 PM GMT
‘బల్ల కింద చేయి’లో భారత్‌‌దే పై చేయి
X
ప్రధాని మోడీ నుంచి రాష్ర్టాల ముఖ్యమంత్రుల వరకు ప్రతి ఒక్కరూ అవినీతిని నిర్మూలిస్తామని చెప్తున్నప్పటికీ దేశంలో అవినీతి మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోంది. అంతర్జాతీయంగా అది మన పరువు పోగొడుతోంది. తాజాగా మరోసారి అవినీతి కారణంగా భారత్ పరువు బజారున పడింది. అవినీతిలో ఇండియాను మించిన దేశం లేదని ఓ అంతర్జాతీయ సంస్థ సర్వేలో వెల్లడైంది.

జర్మనీకి చెందిన ట్రాన్స్‌ పరెన్సీ ఇంటర్‌ నేషనల్‌ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఇండియా అవినీతిలో ఫస్ట్ ప్లేసులో ఉంది. గత ఏడాది కూడా అవినీతిలో మనమే ఫస్ట్‌ లో ఉండడం విచారించాల్సిన విషయం. తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ ఏడాది కూడా ఆసియాలోనే అత్యంత అవినీతి దేశంగా భారత్‌ చెత్త రికార్డును నిలబెట్టుకుంది.

మన దేశంలో ముఖ్యంగా విద్యా - వైద్య రంగాలలో అవినీతి భారీగా ఉందని ఈ సంస్థ తేల్చింది. 69 శాతం అవినీతితో భారత్‌ అగ్రస్థానంలో ఉంటే 65 శాతంతో వియత్నాం, 41 శాతంతో థాయిలాండ్‌, 40 శాతంతో పాకిస్తాన్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 0.2 శాతంతో జపాన్‌ ఈ లిస్టులో చివరి స్థానంలో ఉంది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్‌నేషనల్‌ సంస్థ ఏడాదిన్నరగా నుంచి 16 ఆసియా దేశాల్లో అవినీతిపై సర్వే నిర్వహించింది.