Begin typing your search above and press return to search.

500 కోట్ల గణేషుడు.. ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   4 Sep 2019 8:18 AM GMT
500 కోట్ల గణేషుడు.. ఎక్కడంటే?
X
డైమండ్ సిటీ.. భారత్ లోని గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సూరత్ నగరానికి ఈ పేరుంది. దేశంలోని ప్రముఖ డైమండ్ తయారీ పరిశ్రమలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడి నుంచే దేశ విదేశాల్లో డైమండ్ వ్యాపారం సాగుతుంటుంది. దేశంలో కుబేరులైన డైమండ్ వ్యాపారులున్న నగరం సూరతే.. అలాంటి సూరత్ లో ఇప్పుడు ఓ భక్తుడు వినాయకుడిపై భక్తితో ఏర్పాటు చేసిన డైమండ్ గణేషుడు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

సూరత్ నగరంలో ఖతర్ గాం ప్రాంతానికి చెందిన రాజేష్ పాండవ్ వినాయకచవితి సందర్భంగా ప్రతీఏటా తన ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టిస్తాడు. ఈసారి డైమండ్ వినాయక విగ్రహాన్ని పెట్టి ఘనంగా వేడుకలు మొదలు పెట్టాడు. ఈ అతిపెద్ద గణేషుడి వజ్రాన్ని ఇండియన్ డైమండ్ ఇన్ స్టిట్యూట్ కూడా ధ్రువీకరించడం విశేషం. ఈ అతిపెద్ద గణేషుడి డైమండ్ విగ్రహం 27.24 క్యారెట్ మేలిమి వజ్రం విశేషం. ఇక దీని పొడవు 24 మిల్లీమీటర్లు, వెడల్పు 17 మిల్లీమీటర్లుగా ఉంది.ఈ డైమండ్ గణేషుడి విలువ సుమారు 500 కోట్ల వరకు ఉంటుందని ఇండియన్ డైమండ్ ఇన్ స్టిట్యూట్ పేర్కొంది.

2005లో కాంగోలోని ఎంబోజీ వజ్రాల గనిలో ఈ అతిపెద్ద వజ్రం దొరికింది. దీన్ని వేలంలో రాజేశ్ పాండవ్ 29వేలకు కొనుగోలు చేశాడట రాజేశ్ పాండవ్. అయితే ఆ వజ్రం వినాయకుడి రూపంలో ఉండడంతో దాన్ని మరింత మెరుగులు అద్ది ప్రతీ ఏటా వినాయకచవితిని ఈ వజ్రాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నాడు.

ఈ ఖరీదైన 500 కోట్ల డైమండ్ గణేషుడుని చూడాడానికి మాత్రం వీల్లేదు. అత్యంత విలువైనది కావడంతో రాజేశ్ పాండవ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మాత్రమే దర్శనం చేసేందుకు అనుమతిస్తారట.. రెండు రోజులు మాత్రమే దీనికి పూజ చేసి తాపీ నది నీళ్లు చల్లి మళ్లీ సేఫ్ లాకర్ లో దీన్ని భద్రపరుస్తామని రాజేశ్ పాండే తెలిపారు.