Begin typing your search above and press return to search.
అమెరికాపై ప్రతీకారానికి భారత్ సిద్ధం!
By: Tupaki Desk | 21 May 2018 7:35 AM GMTమిత్రదేశంగా.. వ్యూహాత్మకంగా తమకెంతో కీలకమైన దేశంగా భారత్ గురించి అమెరికా తరచూ చెబుతూ ఉంటుంది. ఇక.. భారత ప్రధానిని కలిసిన సందర్భంలోనూ.. అమెరికా ప్రముఖులు భారత్‌కు వచ్చినప్పుడు.. భారత్ తమకెంత ప్రత్యేకమో చెబుతూ ఉంటారు. అయితే.. ఇవన్నీ మాటల్లోనే కానీ చేతల్లో కాదన్నట్లుగా కొన్ని నిర్ణయాలు చెప్పకనే చెప్పేస్తుంటాయి.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్ విషయంలో కాస్త చిన్నచూపును ప్రదర్శిస్తున్నట్లు చెప్పాలి. ఐటీ విషయంలోనూ.. వీసాల విషయంలోనూ భారత్ కు కొంత అన్యాయం జరిగిందన్న అసంతృప్తి ఉంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యన భారత్ కు దిగుమతి అయ్యే స్టీల్.. అల్యూమినియంపై దిగుమతి సుంకాల్ని పెంచటం ద్వారా భారత్ పై భారాన్ని మోపుతోంది.
దీనిపై చేసిన వినతుల్ని అగ్రరాజ్యం వినని పరిస్థితి. ఈ నేపథ్యంలో అమెరికాకు అర్థమయ్యేలా చేయటానికి భారత సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారత్ కు దిగుమతి అయ్యే వస్తువుల విషయంలో పెంచిన దిగుమతి సుంకానికి ప్రతీకారంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ముఖ్యమైన వస్తువుల విషయంలో దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో.. వచ్చేనెల నుంచి అమెరికా నుంచి దేశానికి వచ్చే బాదంపప్పు..యాపిల్స్.. ప్రత్యేక మోటారు సైకిళ్లతో సహా 20 రకాల ఉత్పత్తులపై సుంకం గరిష్ఠంగా రెట్టింపు స్థాయికి పెంచనున్నట్లు భారత్ వెల్లడించింది. అదే జరిగితే.. అమెరికా నుంచి ఆపేసే.. వేరే దేశాల నుంచి సామాగ్రిని తెచ్చుకోవటం జరుగుతుంది. అదే జరిగితే.. అమెరికాకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.
మనకు మాదిరే కెనాడా.. మెక్సికోకు సైతం స్టీల్.. అల్యూమినియంపై ఎగుమతి సుంకాన్ని పెంచింది. అయితే.. ఆయా దేశాల వినతి మేరకు తగ్గించింది. కానీ.. భారత్ కు మాత్రం నో చెప్పింది. దీనిపై భారత్ డబ్ల్యూటీవోకు కంప్లైంట్ చేసింది. అయినప్పటికీ పరిస్థితుల్లో పెద్ద మార్పు రాని పరిస్థితి. భారత్ ఏటా 150 కోట్ల డాలర్ల విలువైన ఐరన్.. అల్యూమినియంను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. పెంచిన సుంకం కారణంగా వ్యాపారం మీద ప్రభావం పడనుంది.