Begin typing your search above and press return to search.

ఆంధ్రులకు అవ‌మానం..పార్టీల రాజ‌కీయం

By:  Tupaki Desk   |   23 Nov 2019 3:37 AM GMT
ఆంధ్రులకు అవ‌మానం..పార్టీల రాజ‌కీయం
X
ఏపీ నూతన రాజధాని అమరావతి విష‌యంలో...నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. అంటే రాష్ట్ర ప్ర‌భుత్వం క్లారిటీ రూపంలో కాదు. కేంద్ర ప్ర‌భుత్వం గుర్తింపు రూపంలో. జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత కేంద్రం మ్యాప్ లో ఆ రెండింటినీ చేరుస్తూ భౌగోళిక మ్యాప్ లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ పొలిటికల్ మ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించలేదు. దీంతో క‌ల‌క‌లం రేగింది. అయితే, తాజాగా అమరావతితో కూడిన ఇండియా మ్యాప్‌ను కేంద్రం విడుద‌ల చేసింది.

2015లో ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోదీ శంకుస్థాపన చేసిన ఏపీ రాజధాని అమరావతిపై రాజ‌కీయ క‌ల‌క‌లం రేగిన సంగ‌తి తెలిసిందే. తాజాగా భారత మ్యాప్‌లో రాజదానిగా అమరావతిని గుర్తించకుండా కేంద్ర హోం శాఖ మాప్ విడుదల చేయడంతో...ఇది మ‌రో మ‌లుపు తిరిగింది. కేంద్రం దోషిగా మారింది. అయితే, స్థానిక ప్రభుత్వం తమ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ గెజిట్ జారీ చేయలేదని, దీంతో కేంద్రం సైతం గుర్తించలేదని స‌మాధానం వ‌చ్చింది. తాజాగా పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఆయా పార్టీల నేత‌లు గ‌ళం వినిపించ‌డంతో...అమరావతిని రాజధానిగా పేర్కొంటూ...కేంద్రం తాజాగా మ్యాప్‌ విడుద‌ల చేసింది.

తాజాగా అమరావతితో కూడిన ఇండియా మ్యాప్‌ను కేంద్రం రిలీజ్ చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కొత్త మ్యాప్‌ను ట్వీట్ చేశారు. ఎట్ట‌కేల‌కు కేంద్రం ఆంధ్రుల‌కు చేసిన‌ అవ‌మానాన్ని స‌రిదిద్దింద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. కాగా, ఇటు బీజేపీ నేత‌లు, అటు టీడీపీ నేత‌లు త‌మ కృషి వ‌ల్లే...ఈ స‌వ‌రించిన మ్యాప్‌ విడుద‌లైంద‌ని చెప్తున్నారు.