Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ లో భారత్ నంబర్1.. మరి వ్యాక్సినేషన్ ప్రక్రియలో..?
By: Tupaki Desk | 6 May 2021 4:30 PM GMTప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి సమర్థమంతమైన టీకాను తయారు చేసింది భారత్. మరి వ్యాక్సినేషన్ ప్రక్రియలో మన దేశ స్థానం మాత్రం చాలా తక్కువగా ఉంది. ప్రపంచ దేశాల్లో టీకాల పంపిణీ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. కెనడా 12-15ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వొచ్చని కెనడా ప్రభుత్వం అనుమతించింది. తక్కువ వయస్సు గల పిల్లలకు టీకాకు అనుమతించిన దేశంగా నిలిచింది. 16ఏళ్లకు పైబడిన వారికి టీకా ఇవ్వడానికి అక్కడ గతేడాదే అనుమతులు లభించాయి.
మనదేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిదానంగా సాగుతోంది. తొలుత 45 ఏళ్లకు పైబడిన వారికి టీకాను ఇస్తామన్న ప్రభుత్వం ఆ తర్వాత మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత టీకా డోసుల కొరతతో మళ్లీ 45 ఏళ్లు గలవారికే ఇవ్వాలని నిర్ణయించింది. దేశంలో ఇప్పటివరకు 1.5 శాతం మందికే టీకా ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
కెనడా లాంటి దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహిస్తున్నాయి. యుద్ధప్రాతిపదిక ప్రజలకు టీకాలు ఇస్తున్నారు. భారత్ లో మాత్రం ఇంకా ఒక శాతం ప్రజలకు మాత్రమే టీకా అందింది. ఇంత నిదానంగా వ్యాక్సినేషన్ జరిగితే 130 కోట్ల జనాభాకు పూర్తి టీకాలు ఇచ్చే నాటికి ఎంత సమయం పడుతుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రుల్లో పడకల కొరత, ఆక్సిజన్ దొరకక చాలామంది ఊపిరి ఆడక అసువులు బాసారు. దీనిపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ లో విజృంభిస్తుండగా మరోవైపు ఎన్నికలు హవా సాగుతోంది. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇటీవలె వెల్లడయ్యాయి. అంతేకాకుండా కుంభమేళా వంటి కార్యక్రమాలు జరిగాయి. త్వరలో మూడో దశ వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం ఇప్పటికైనా అప్రమత్తమై తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.