Begin typing your search above and press return to search.
రాజ్ నాథ్ నోట అణ్వస్త్ర ప్రయోగ మాటలు వచ్చాయంటే?
By: Tupaki Desk | 16 Aug 2019 12:52 PM GMTకశ్మీర్ అంశంపై మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాల సంగతి తెలిసిందే. గడిచిన కొద్ది రోజులుగా జాతీయ.. అంతర్జాతీయ వేదిక మీద కశ్మీర్ అంశంపై అదే పనిగా హాట్ హాట్ చర్చలు సాగుతున్న వేళ.. భారత్ పై యుద్ధానికి సైతం తాము సిద్ధమన్నట్లుగా పాక్ దేశాధ్యక్షుడు.. దేశ ప్రధాని వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ మాట్లాడుతూ.. అణ్వస్త్ర ప్రయోగం మీద మాట్లాడటం.. భారత్ తో యుద్ధం మొదలైతే ప్రపంచం మొత్తం మీదా ప్రభావం చూపుతుందని.. ప్రపంచ దేశాలు కశ్మీర్ అంశంపై స్పందించాలని వ్యాఖ్యానించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అణ్వస్త్ర ప్రయోగం విషయంలో తాము మొదటినుంచి చెబుతున్నట్లుగా.. తొలుత తాము ప్రయోగించకూడన్నదే ప్రస్తుత దేశ విధానంగా ఉందన్నారు. తొలుత అణ్వస్త్ర ప్రయోగానికి విరుద్ధమన్న దానికి భారత్ కట్టుబడి ఉందని.. అయితే భవిష్యత్ పరిణామాలపై తానేమీ చెప్పలేనని చెప్పటం ఇప్పుడు ఆసక్తికకరంగా మారింది.
రాజస్థాన్ లోని జైసల్మేర్ లో జరుగుతున్న ఒక అంతర్జాతీయ సమావేశంలో పాల్గొన్న రాజ్ నాథ్ మాట్లాడుతూ.. భారత్ బాధ్యతాయుతమైన అణ్వస్త్ర శక్తిగా అవతరించే విషయంలో దేశంలోని ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ అంశంగా ఆయన వ్యాఖ్యానించారు. గతంలో మాదిరి తొలుత అణ్వస్త్ర ప్రయోగం మీద కచ్ఛితమైన మాట రాజ్ నాథ్ నోటి నుంచి రాకపోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.