Begin typing your search above and press return to search.
పాక్ లో ఇంజనీరింగ్ కు ఇండియా ఏన్ఓసీ తప్పనిసరి
By: Tupaki Desk | 31 Oct 2021 2:30 AM GMTఈమద్య కాలంలో విద్య అనేది అంతర్జాతీయ స్థాయి అయ్యింది. ఏ దేశంలో అయినా చదువుకుని.. ఏ దేశంలో అయినా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇండియాకు చెందిన వేలాది మంది వైధ్య విద్యార్థులు ప్రతి ఏడాది చైనాతో పాటు వివిధ దేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్నారు. కేవలం ఎంబీబీఎస్ మాత్రమే కాకుండా ఇంజనీరింగ్ కోసం కూడా ఇండియా నుండి వేలల్లో విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్తున్నారు. కొందరు ఇతర దేశాల్లో ఇంజనీరింగ్ విద్యను ముగించి ఆ తర్వాత తాము మోసపోయాం అని తెలుసుకుంటున్నారు. పలు దేశాల్లో కనీసం గుర్తింపు లేని యూనివర్శిటీల్లో ఇంజనీరింగ్ చేయడం ద్వారా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉండటం లేదు. అందుకే ఇంజనీరింగ్ చేసే సమయంలోనే ఖచ్చితంగా ఆ యూనివర్శిటీ యొక్క గుర్తింపు మరియు చదవ బోతున్న కాలేజీకి సంబంధించిన విషయాలను ఒకటికి రెండు సార్లు చూసుకోవాలంటూ అఖిల భారత సాంకేతిక విద్య మండలి సూచిస్తుంది.
ఇటీవల కాలంలో పాకిస్తాన్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన కొందరు విద్యార్థులు ఇండియాలో ఉద్యోగాల కోసం ప్రయత్నించిన సమయంలో వారికి అర్హత లేదు అనే సమాధానం వచ్చింది. గుర్తింపు లేని యూనివర్శిటీల ద్వారా వచ్చే డిగ్రీ పట్ట వల్ల ఏమీ ఉపయోగం ఉండదు అంటూ సంస్థలు చెబుతున్నాయి. అందుకే ఇక నుండి పాకిస్తాన్ లో ఇంజనీరింగ్ చేయాలనుకున్న వారు ఖచ్చితంగా అఖిల భారత సాంకేతిక విధ్య మండలి నుండి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ పొందాలని.. అప్పుడే అక్కడ చదవడానికి వీలు ఉంటుంది.. ఆ తర్వాత ఇండియాలో ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుందని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
విదేశాల్లో ఇంజనీరింగ్ విద్య చేస్తున్న వారు ఎంతో మంది ఉంటున్నా కూడా పాకిస్తాన్ లో చేయాలి అనుకుంటున్న వారికి మాత్రమే ఈ కండీషన్ వర్తిస్తుంది అంటూ అధికారులు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున పాకిస్తాన్ లో ఇంజనీరింగ్ చేసేందుకు వెళ్తున్న వారికి ఇది ఖచ్చితంగా అడ్డు కట్ట వేస్తుందని.. అలాగే మంచి సాంకేతిక విద్యను అందించే యూనివర్శిటీలో మాత్రమే వారు చదివేందుకు వెళ్తారని విద్యా వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పాకిస్తాన్ కు వెళ్లే విద్యార్థులకు మాత్రమే కాకుండా ఎంబీబీఎస్ చదివేందుకు విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల విషయంలో కూడా కాస్త శ్రద్ద పెట్టి వారు చదువుతున్న యూనివర్శిటీల గురించి వారికి అవగాహణ కల్పించాల్సిన అవసరం ఉందంటూ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.