Begin typing your search above and press return to search.

భార‌త్‌-పాక్ ఫైన‌ల్ మ్యాచ్ ఫిక్స్‌?!

By:  Tupaki Desk   |   2 July 2017 4:14 AM GMT
భార‌త్‌-పాక్ ఫైన‌ల్ మ్యాచ్ ఫిక్స్‌?!
X
సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు కేంద్ర సామాజిక న్యాయ స‌హాయ‌మంత్రి రాందాస్ అథావాలే. గ‌త నెల 18న జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్స్ లో భార‌త్ -పాక్‌లు త‌ల‌ప‌డ‌టం తెలిసిందే. కోట్లాది మంది ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన ఈ మ్యాచ్ లో ఊహించ‌ని రీతిలో భార‌త్ ఓట‌మిపాలు కావ‌టం తెలిసిందే.

ఇటీవ‌ల కాలంలో టీమిండియా ఇంత పేల‌వంగా ఆడిన మ్యాచ్ లేద‌న్న అభిప్రాయంతో పాటు.. మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా జ‌రిగిందా? అన్న సందేహాలు కొంద‌రు వ్య‌క్తం చేశారు. ఓట‌మి నేప‌థ్యంలో ఇలాంటి సందేహాలు రావ‌టం మామూలే అనుకోవ‌చ్చు. కానీ.. సామాన్యుల‌కు కాకుండా ఏకంగా కేంద్ర‌మంత్రికే ఆ సందేహం రావ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

చిర‌కాల ప్ర‌త్య‌ర్థిపై ఘోర ప‌రాజ‌యంపై కేంద్ర‌మంత్రి మాట్లాడుతూ ఓట‌మి త‌న‌ను విస్మ‌యానికి గురి చేసింద‌న్నారు. గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా అధావాలే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీమిండియా లాంటి బ‌ల‌మైన జ‌ట్టు ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో బ‌ల‌హీన‌మైన పాక్‌ ను 180 ప‌రుగుల తేడాతో చిత్తు చేసింద‌ని.. ఫైనల్స్ మాత్రం టీమిండియా 124 ప‌రుగుల తేడాతో ఓడిపోవ‌టం త‌న‌కు ఆశ్చ‌ర్యం క‌లిగింద‌న్నారు. అస‌లు ఇదెలా జ‌రిగింది? మ‌్యాచ్ ఫిక్స్ అయ్యిందా? అంటూ డౌట్ల మీద డౌట్లు వెలిబుచ్చిన ఆయ‌న ఈ ఉదంతంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానించారు.

ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు ఆటగాళ్లపై ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేయ‌టంతో పాటు.. అనుమానం వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం. గ‌తంలో యువ‌రాజ్ సింగ్ ఎన్నో ప‌రుగులు సాధించాడ‌ని.. కానీ పాక్ మ్యాచ్ లో మాత్రం ఓడిపోవ‌టానికే ఆడిన‌ట్లుగా క‌నిపించింద‌న్నారు. గ‌తంలో ఎన్నో ప‌రుగులు తీసిన కోహ్లీకి ఆ రోజు ఏమైన‌ట్లు? అందుకే.. మ్యాచ్ ఫిక్సింగ్ జ‌రిగింద‌ని త‌న‌కు అనుమానం క‌లుగుతోందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. "ఆట‌గాళ్లు మ‌న‌ల్ని మోసం చేశారు.. పాక్ వంటి ప్ర‌త్య‌ర్థి ముందు వాళ్లు మోక‌రిల్లారు" అంటూ కేంద్ర‌మంత్రి నోటి నుంచి వ‌చ్చిన మాటలు కొత్త దుమారాన్ని రేపుతున్నాయి.

మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ కొత్త చ‌ర్చ‌ను తెర మీద‌కు తెచ్చిన కేంద్ర‌మంత్రి.. మ‌రో సంచ‌ల‌న అంశాన్ని ప్ర‌స్తావించారు. ఎవ‌రూ క‌ల‌లో కూడా ఊహించ‌ని ఒక కొత్త స్కీం తీసుకురావాలంటూ ఆయ‌న చెప్పిన ఐడియా విన్నంత‌నే ఒళ్లు మండే వ్యాఖ్య‌లు చేశారు. టీమిండియాలో ఎస్సీ.. ఎస్టీ వ‌ర్గాల‌కు చెందిన క్రీడాకారుల‌కు రిజ‌ర్వేషన్‌ క‌ల్పించాల‌ని వ్యాఖ్యానించారు. క‌నీసం 25 శాతం రిజ‌ర్వేషన్ క‌ల్పిస్తే ఆయా వ‌ర్గాల‌కు ఎంతో ప్ర‌యోజ‌నం చేకూర్చిన‌ట్లు అవుతుంద‌న్నారు. ప్ర‌తిభే ఎంపిక‌కు కొల‌మానంగా ఉండాల్సిన చోట కూడా.. రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌నే కొత్త త‌ర‌హా రాజ‌కీయ మాట‌లు కేంద్ర‌మంత్రి నోట వ‌స్తుంటే చిరాకు రాక మాన‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/