Begin typing your search above and press return to search.
వావ్.. అనిపించేలా ఇస్రో ఫ్యూచర్ ప్లాన్స్!
By: Tupaki Desk | 14 Jun 2019 5:49 AM GMTభారత అంతరిక్ష పరీక్ష అన్నంతనే గుర్తుకొస్తుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. షార్ట్ కట్ లో చెప్పాలంటే ఇస్రో. ప్రభుత్వం అందించే అరకొర నిధులతో అద్భుతాలు సృష్టించే ఈ సంస్థ.. తాజాగా తన భవిష్యత్ ప్రణాళికల్ని చెప్పుకొచ్చింది. ప్రపంచ దేశాలు అసూయపడే తన ఫ్యూచర్ ప్లాన్స్ ను వెల్లడించిన ఈ సంస్థ ఇప్పుడు అందరి దృష్టి తన మీద పడేలా చేసింది.
అగ్రరాజ్యాలు సైతం ఆలోచనలో పడేలా చంద్రయాన్ ప్రయోగాన్ని నిర్వహించిన ఇస్రో.. అతి తక్కువ ఖర్చుతో అద్భుత ఫలితాలు ఎలా సాధ్యమో ఇప్పటికే ఫ్రూవ్ చేసిన ఈ సంస్థ.. తన భవిష్యత్ ప్రణాళికలు ఎవరూ ఊహించని కొత్త అంశాల్ని పెట్టుకోవటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. వ్యోమగాములను రోదసిలోకి పంపేందుకు గగన్ యాన్ ప్రాజెక్టును ప్రకటించటంతో పాటు.. భూకక్ష్యలో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు.
తాజాగా ఇస్రో సంస్థ ఛైర్మన్ కె. శివన్ వెల్లడించిన ఫ్యూచర్ ప్లాన్స్ అదిరేలా ఉన్నాయి. అవేమంటే..
+ 2022లో గగన్ యాన్ ప్రాజెక్టును చేపట్టాక దీనిపై ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నాం. అమెరికా - రష్యా తదితర దేశాల ఆధ్వర్యంలో సాగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ ఎస్) ప్రాజెక్టులో భారత్ భాగస్వామి కాబోదు. మనకు మనమే సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోనున్నాం.
+ భారత అంతరిక్ష కేంద్రం చాలా చిన్నగా ఉంటుంది. దాని బరువు 20 టన్నులు ఉండొచ్చు. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో ప్రయోగాలకు దాన్ని ఉపయోగిస్తాం. ఈ కేంద్రం వల్ల మరింత ఎక్కువ మందిని రోదసిలోకి పంపేందుకు వీలు కలుగుతుంది.
+ వ్యోమగాములను రోదసిలోకి పంపే గగన్‌యాన్ ప్రాజెక్టుకు.. భారత అంతరిక్ష కేంద్రం కొనసాగింపు అవుతుంది. దీని అమలుకు ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ టైం పట్టొచ్చు. చంద్రుడు - గ్రహశకలాలపైకి అంతర్జాతీయ సమాజం చేపట్టే మానవసహిత అంతరిక్ష యాత్రల్లో మేం కూడా పాలుపంచుకుంటాం.
+ రోదసి కార్యక్రమానికి సంబంధించి మా వద్ద విస్పష్ట ప్రణాళిక ఉంది. సూర్యుడిపై పరిశోధనలకు ఉద్దేశించిన ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది మొదటి అర్ధభాగంలో ప్రయోగిస్తాం. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ప్రాంతానికి వెళుతుంది.
+ ఆ వ్యోమనౌక నిత్యం సూర్యుడిపై దృష్టి పెడుతుంది. ప్రచండ భానుడి బాహ్య వలయమైన ‘కరోనా’పై విశ్లేషణలు అందిస్తుంది.ఈ ప్రయోగంతో వాతావరణ మార్పులపై అధ్యయనానికి కీలకమవుతుంది.
+ 2-3 ఏళ్లలో శుక్ర గ్రహం వద్దకు ఒక వ్యోమనౌకను పంపుతాం. తీవ్ర స్థాయి ఉష్ణోగ్రతలతో ఆ గ్రహం మండిపోతోంది. అక్కడికి పంపిన అనేక వ్యోమనౌకలు విఫలమయ్యాయి. మేం మాత్రం విజయం సాధించాలని దృఢ నిశ్చయంతో ఉన్నాం. అక్కడి వాతావరణంపై పరిశోధనలు సాగించాలనుకుంటున్నాం.