Begin typing your search above and press return to search.
భారత్ కి ట్రంప్ వార్నింగ్...ఆ డ్రగ్ పంపకపోతే ప్రతీకారం తప్పదు?
By: Tupaki Desk | 7 April 2020 7:10 AM GMTప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ఈ కరోనా కి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో కరోనా వైరస్ పై పోరాటం చేసి గెలవాలి అంటే ..లాక్ డౌన్ తప్ప ప్రపంచం దగ్గర మరో మార్గం లేదు. దీనితో లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే , ఈ కరోనా దెబ్బకి అగ్రరాజ్యం అమెరికా కూడా చిగురుటాకులా వణికిపోతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ..భారత్ సాయం కోరారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా కి వ్యాక్సిన్ గా యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సిక్లొరోక్విన్ ను వాడుతుంది. దీనితో మనదేశం నుంచి ఎగుమతి అయ్యే యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సిక్లొరోక్విన్ ను తమకు సరఫరా చేయాలంటూ రెండురోజుల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభ్యర్తించారు.
కానీ, తాజాగా ట్రంప్ స్వరం మారిపోయింది. కరోనా వైరస్ వైద్య చికిత్స లో వినియోగించే ఈ హైడ్రాక్సిక్లొరోక్విన్ డ్రగ్ ను వెంటనే తమ దేశానికి పంపించకపోతే.. భారత్ పై ప్రతీకారం తప్పదని నేరుగా హెచ్చరించారు. తన అధికారిక నివాసం వైట్ హౌస్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమెరికాలో కరోనా వైరస్ భారీ విధ్వంసాన్ని సృష్టిస్తోందని, ఈ వైరస్ మిగిల్చిన దుష్ప్రభావాలు - పరిణామాలు సుదీర్ఘకాలం పాటు ఉండబోతున్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దీన్ని నివారించడానికి చేయవల్సిన అన్ని పనులని చేస్తున్నామని తెలిపారు.
హైడ్రాక్సిక్లొరోక్విన్ డ్రగ్‌తో కరోనా వైరస్ పేషెంట్లకు సరైన దిశలో వైద్యాన్ని అందించడానికి అవకాశాలు ఉన్నాయని, ఈ హైడ్రాక్సిక్లొరోక్విన్ మిశ్రమాలతో ఆశించిన ఫలితాలు వస్తాయంటూ వైద్య - ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిపుణులు స్పష్టం చేస్తన్నారని - కానీ , తమ వద్ద ఈ డ్రగ్ పరిమితంగా ఉందని చెప్పారు. దీని కోసం తాను భారత ప్రధానమంత్రి తో ఆదివారం నాడే ఫోన్ లో మాట్లాడానని, ఇప్పటిదాకా తాను ఆశించిన ఫలితం ఏదీ రాలేదని అన్నారు. హైడ్రాక్సిక్లొరోక్విన్ డ్రగ్ ఎగుమతి చేయడాన్ని భారత్ నిషేధించిందనే విషయం తెలుసు అని , అయినప్పటికీ.. తమ అవసరాల దృష్ట్యా దాన్ని సరఫరా చేయాలని కోరినట్లు తెలిపారు. రెండు రోజుల తరువాత కూడా భారత్ నుంచి తాను ఆశించిన సమాధానం రాలేదని చెప్పారు. అయినప్పటికీ - ఫర్వాలేదని - దీనికి తప్పనిసరిగా ప్రతీకారం ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా భారత్ మధ్య దౌత్య సంబంధాలకు మించిన స్నేహబంధం ఉందని - ఈ రెండు దేశాల మధ్య స్నేహపూరక వాతావరణం ఉందని గుర్తు చేశారు. అయినా కూడా భారత్ స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారు.