Begin typing your search above and press return to search.
చైనాకు షాకిచ్చేలా మోడీ భారీ ప్లానింగ్..!
By: Tupaki Desk | 5 May 2020 9:50 AM GMTకష్టం ఎదురైనప్పుడు బాధ పడతాం. వేదన చెందుతాం. అయ్యో.. ఇంత పెద్ద కష్టం మాకే రావాలా? అంటూ తల్లడిల్లుతాం. కానీ.. తరచి చూస్తే.. కష్టం ఎదురైన తర్వాత వచ్చే సుఖాన్ని చాలామంది పట్టించుకోరు. కష్టం మరింత రాటుతేలేలా చేయటమే కాదు కొత్త అవకాశాల్ని ఇస్తుంది. మైండ్ సెట్ ను మార్చేస్తుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా భారత్ కు ఇలాంటి అనుభవమే ఎదురు కానుందా? అంటే అవునని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలు చైనా కేంద్రంగా పని చేస్తుంటాయి. అక్కడి వర్క్ కల్చర్ తో పాటు.. తక్కువ వేతనాలకే వచ్చే శ్రామికులు.. ఇతర పరిస్థితులతో ప్రపంచంలోని పలు ప్రముఖ కంపెనీలు చైనా కేంద్రంగా తమ పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తుంటాయి.
కరోనా ఎపిసోడ్ తో చైనా నుంచి బయటకు వచ్చేందుకు వీలుగా ప్రముఖ కంపెనీల ఆలోచనల్లో మార్పు వస్తోంది. చైనాలో తమ కర్మాగారాల్ని తరలించాలంటే ఎక్కడకు మార్చాలన్నది ప్రశ్నగా మారింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి వీలుగా భారత సర్కారు పావులు కదుపుతోంది. తమ దేశంలో కంపెనీలు పెట్టేందుకు వచ్చే సంస్థలకు భూముల్ని ఇచ్చేందుకు వీలుగా మోడీ సర్కారు ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది.
ఇందులో బాగంగా భారీ ఎత్తున భూసేకరణకు తెర తీయనుంది. రానున్న రోజుల్లో చైనా నుంచి వచ్చే కంపెనీలకు భూముల్ని కేటాయించేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా 4,61,589 హెక్టార్ల భూమిని గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో 1,15,131 హెక్టార్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్.. గుజరాత్.. మహారాష్ట్ర.. తమిళనాడుల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. కేంద్రం సిద్దం చేస్తున్న భూముల విస్తీర్ణం ఒక చిన్న దేశం విస్తీర్ణంతో సమానంగా చెబుతున్నారు. లక్సెంబర్గ్ 2.43లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంటుంది.
భారత్ లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు స్థల సేకరణ పెద్ద సమస్యగా మారుతోంది. ఇప్పటివరకూ ఉన్న విధానాల ప్రకారం పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు.. భూముల్ని సొంతంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో పలు భూ వివాదాలతో పాటు.. విద్యుత్.. నీరు.. రోడ్డు తదితర మౌలిక సదుపాయాల విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవన్ని కేంద్రమే ఏర్పాటు చేస్తే.. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించటమే కాదు.. పెద్దఎత్తున కంపెనీలు భారత్ బాట పడితే.. ఉపాధి అవకాశాలు భారీగా పెరగటం ఖాయమంటున్నారు. ప్రతి కష్టం ఒక సుఖానికి అవకాశం ఇస్తుందన్న మాటలో నిజమెంతన్నది రానున్న రోజులు చెప్పేస్తున్నాయని చెప్పక తప్పదు.