Begin typing your search above and press return to search.
మోడీ డ్రీం టీంలో హైదరాబాదీ.. ఆమె ఎంపిక ఎందుకంటే?
By: Tupaki Desk | 9 March 2020 5:26 AM GMTసోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరించే ప్రధాని మోడీ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ.. తన సోషల్ మీడియా ఖాతాల కు దూరంగా ఉంటానని ప్రకటించటం తెలిసిందే. ఆ ఒక్క రోజున తన సోషల్ ఖాతాల్ని నిర్వహించేందుకు దేశ వ్యాప్తంగా శక్తివంతమైన మహిళల్ని ఎంపిక చేయటం తెలిసిందే. అలా ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన కల్పనా రమేశ్.
ఆమె ఎవరు? ఎందుకు ఎంపిక చేశారన్న విషయంలో కి వెళితే.. ఆమె ప్రొఫైల్ చూసినంతనే ఎంపిక ఎందుకు జరిగిందో ఇట్టే అర్థమైపోతుంది. పదేళ్ల క్రితం వరకూ కల్పనా రమేశ్ అమెరికా లో ఉండేవారు. అక్కడి నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన ఆమె హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. అమెరికాలో లాగా పరిశుభ్రమైన.. స్వచ్ఛమైన తాగునీరు ఉంటుందనుకొని వచ్చిన ఆమెకు మొదట్లోనే షాక్ తగిలింది.
ఆమె ఉన్న చోట వారానికి రెండు ట్యాంకర్ల నీళ్లు తెప్పించుకోవటమే కాదు.. తాగేందుకు సైతం బ్రాండెడ్ మినరల్ వాటర్ తాగాల్సి వచ్చేది. ఎందుకిలా? అని ఎవరిని అడిగినా.. ఇక్కడ ఇంతే అన్న సమాధానం రావటంతో ఆమె ఆశ్చర్యపోయేవారు. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో తానున్న ఇంటిని మార్చే ప్రయత్నం చేశారు.
ఇంటి డాబా మీదనే వాన సంరక్షణ చర్యలు రూపొందించి.. వానాకాలంలో పడే నీటిని వేస్ట్ కాకుండా ఇంటి ఆవరణలోకే వెళ్లేలా చేశారు. అంతేకాదు.. ఇంట్లో వాడిన నీటిని కూడా రీసైక్లింగ్ కు చేయటం మొదలు పెట్టారు. అలాంటి ప్రయత్నాలతో ఇంటికి సరిపడే నీటిని వారికి వారే సొంతంగా ఏర్పాటు చేసుకోగలిగారు. ఈ విషయంతో ఆమె తన కాలనీ మీద ఫోకస్ పెట్టారు.
అక్కడి వారికి సలహాలు ఇచ్చి ఇంకుడు గుంతలు.. సంరక్షణ ట్యాంకులు పెట్టించారు. అధికారుల తో కలిసి మూడు నెలల పాటు అవేర్ నెస్ ప్రోగ్రాం చేపట్టారు. హైదరాబాద్ నగరంలో నీటి ట్యాంకర్ల అవసరం లేకుండా చేయాలన్నదే తన కోరికగా చెబుతారు. వాటర్ వారియర్ గా ఆమెను అభిమానంగా పిలుస్తుంటారు. సొసైటీ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండివరీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్న ఆమె.. గో గ్రీన్ కార్యకర్తగా సుపరిచితురాలు. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న కల్పనను..మోడీ ఎంపిక చేసిన ఏడుగురు మహిళల్లో ఒకరుగా నిలిచారు. దేశ వ్యాప్తంగా జల్లెడు పట్టి.. నారీ శక్తికి స్ఫూర్తిగా నిలిచే వారిని ఎంపిక చేస్తే.. అందులో హైదరాబాదీ ఒకరు ఉండటం తెలుగు రాష్ట్రాల ప్రజలకు గర్వకారణంగా చెప్పక తప్పదు.