Begin typing your search above and press return to search.
భారత సైన్యం సిద్ధంగా ఉండాలి - ఆర్మీ చీఫ్
By: Tupaki Desk | 2 Sep 2015 4:58 AM GMTభారత్ విషయంలో పాక్ వైఖరి రోజు రోజుకీ ముదిరి పాకానపడుతుంది. రెచ్చిపోయి మరీ భారత్ ను రెచ్చగొడుతుంది. సరిహద్దుల్లో నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తుంది. కేవలం ఆగస్టు నెలలోనే 55 సార్లు అప్రకటిత కాల్పులకు తెగబడిందంటే... కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంలో ఏస్థాయి మొండివైఖరి అవలంబిస్తుందో ఇట్టే అర్ధం అవుతుంది. ఇదే సమయంలో ఈ ఏడాది ఇప్పటివరకూ ఇండియా - పాకిస్థాన్ సరిహద్దుల్లో సుమారు 245 అవాంచనీయ సంఘటనలు జరిగాయి.
ఈ విషయాలన్నీ వెళ్లడిస్తున్న భారత ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్... జమ్మూ కశ్మీర్ లో సమస్యలు సృష్టించేందుకు పాక్ కొత్త కొత్త విదానాలు అవలంబిస్తుందని.. జమ్మూ కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పేందుకు, ప్రశాంతతను భగ్నం చేసేందుకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉందని అభిప్రాయపడ్డారు! జరుగుతున్న పరిణామాలను చూస్తే... ఏక్షణమైనా, ఏమైనా జరగవచ్చునని.. ఈ క్రమంలో పాక్ ని కంట్రోల్ చేయడానికి భారత సైన్యం అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఆర్మీచీఫ్ దల్బీర్ సింగ్ మాటలు విన్న అనంతరం... రాబోయే కాలంలో జరగబోయే పరిణామలపై రకరకాల ఊహాగానాలు వెళువడుతున్నాయి. భారత్ మంచి తనాన్ని, శాంతి మార్గాన్ని చేతకాని తనంగా భావిస్తున్న పాక్ కుక్కకాటుకు చెప్పుదెబ్బే సరైన మందని పలువురు అభిప్రాయపడుతున్నారు!