Begin typing your search above and press return to search.

10 మందిలో అరుగులు ఇంటర్నెట్ లోనే ... !

By:  Tupaki Desk   |   24 April 2021 5:30 PM GMT
10 మందిలో అరుగులు ఇంటర్నెట్ లోనే ... !
X
ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశం అంతా ఆంక్షలు , వర్క్ ఫ్రమ్ హోమ్‌ ప్రకటించడంతో చాలామంది ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఎక్కువ శాతం పనులకు ఇంటర్నెట్‌ పై ఆధారపడుతున్నారు. ఎంతో మంది నెట్‌ ఇంట్లో కాలం గడిపేస్తున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేనంత భారీస్థాయిలో ఇంటర్నెట్‌ వినియోగం పెరిగింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగిస్తున్నారు. మన దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం, నమోదవుతున్న కేసులు, తీవ్రత ఎలా ఉంది? వంటి అప్‌డేట్స్‌ తెలుసుకోవడం మొదలు దూర ప్రాంతాలు, దేశాల్లో ఉన్న ఆప్తుల క్షేమ సమాచారం తెలుసుకోవడం, నచ్చిన సినిమాలు, ప్రోగ్రామ్స్‌ చూడటం వరకు అన్నిటికీ నెట్‌ బటన్‌ నొక్కేస్తున్నారు.

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, హైర్‌, ఐఎంవో, ఆన్‌లైన్‌ షాపింగ్ ‌లు, నగదు చెల్లింపులతోపాటు అన్ని రకాల బిల్లుల చెల్లింపులు, బ్యాంకు ఖాతాల లావాదేవీలను సైతం ఇంటర్‌ నెట్‌ ద్వారానే జరిపేస్తున్నారు. రకరకాల పుస్తకాలు, గ్రంథాలు కూడా ఇంటర్నెట్‌లో లభిస్తుండటంతో పెద్దలు వాటిపై ఆసక్తి చూపుతున్నారు. ఇక పిల్లల విషయానికి వస్తే స్కూళ్లు మూతపడటంతో ఎక్కువ శాతం కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఇంటర్నెట్‌ ద్వారా హోం వర్కులు ఇస్తున్నాయి. వాటిని చూసి తల్లిదండ్రులు పిల్లలతో రాయించడం, చదివించడం చేస్తున్నారు. అలాగే చిన్నారులకు ఇష్టమైన కార్టూన్లు, బొమ్మలు, గేమ్స్‌ వంటివి ఎన్నో నెట్‌లో లభిస్తుండటంతో బుజ్జాయిలకు స్మార్ట్‌ఫోనే ఆటవస్తువుగా మారిపోయింది.

ప్రపంచ జనాభాలో రెండింటి మూడొంతుల మంది మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు అని ఓ నివేదిక వెల్లడించింది. ఇంటర్నెట్ వాడుతున్న వారు 4.72 బిలియన్లకి చేరుకున్నట్టు తెలిపింది. దీని ప్రతి పది మందిలో ఆరుమంది ఆన్లైన్ లోనే ఉన్నారు. ఇంటర్నెట్ వినియోగంలో ప్రపంచంలో 21 శాతం తో ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే .. 13 శాతంతో భారత్ రెండో స్థానంలో ఉంది. అమెరికా లో కేవలం 6.3 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ వాడుతున్నారు.