Begin typing your search above and press return to search.

పాక్ తో 10..చైనాతో 15 రోజుల యుద్ధానికి ఏర్పాట్లు?

By:  Tupaki Desk   |   30 April 2017 7:01 AM GMT
పాక్ తో 10..చైనాతో 15 రోజుల యుద్ధానికి ఏర్పాట్లు?
X
పాకిస్థాన్ - చైనాలతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియా ఆ దేశాలతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. పాక్ తో కనీసం 10 రోజులు... చైనాతో 15 రోజులు యుద్ధానికి రెడీ కావాలని, అన్ని ఏర్పాట్లు చేయాలని ఎయిర్ ఫోర్స్ కు ఈ మేరకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. యుద్ధం చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని తన కమాండర్లకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ఆదేశాలు జారీ చేసిందని... ఢిల్లీలో ఐఏఎఫ్ కమాండర్ల సదస్సు జరుగగా, ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా ఈ మేరకు కమాండర్లకు సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది.

యుద్ధం వస్తే, పాక్ ను పది రోజుల పాటు - చైనాను 15 రోజుల పాటు ఎదుర్కోవడానికి వీలుగా కమాండర్లు సిద్ధంగా ఉండాలని, పోరాట సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలని ఆయన సూచించినట్టు ఐఏఎఫ్ వర్గాలు వెల్లడించాయి. అందుబాటులోని యుద్ధ విమానాలు - పూర్థి స్థాయి ఆయుధాలు - క్షిపణులు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. శత్రుదేశాల నుంచి దూసుకు వచ్చే క్షిపణులపై సమాచారాన్ని అందించే అలర్ట్ రాడార్ సిస్టమ్ ను రెడీగా ఉంచాలని ఆయన సూచించారు. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఇన్స్ పెక్షన్ కు ఆదేశాలు ఇస్తూ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సన్నద్ధం కావలని ఆయన వెల్లడించినట్టు తెలుస్తోంది.

కాగా ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో ఇది నిజం కావొచ్చన్న వాదన వినిపిస్తోంది. పాక్ తో యుద్ధం చేసి ఎన్నికలకు వెళ్తే బీజేపీకి మళ్లీ తిరుగులేని విజయం గ్యారంటీ. అందుకే బీజేపీ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోందని చెబుతున్నారు. మరోవైపు చైనా కూడా అటు ఉత్తరకొరియా విషయంలో అటు అమెరికా నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న సమయంలో ఇటు వైపు మనం యుద్ధం చేస్తే ప్రయోజనం ఉంటుందని కేంద్రం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/