Begin typing your search above and press return to search.
తొలి రాఫెల్ యుద్ధవిమానం వచ్చేసింది..
By: Tupaki Desk | 21 Sep 2019 5:00 AM GMTఎప్పుడో 70వ దశకంలో రష్యా తయారు చేసిన మిగ్ విమానాలనే భారత్ వాడుతోంది. మొన్న పాకిస్తాన్ పై దాడిలో, మన వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ పాక్ విమానాన్ని తరిమికొట్టింది ఈ మిగ్ విమానాలతోనే.. అయితే పాకిస్తాన్ వద్ద మాత్రం అత్యాధునిక అమెరికా తయారీ ఎఫ్16 యుద్ధవిమానాలున్నాయి. ఇవి మన మిగ్ విమానాల కంటే చాలా అత్యాధునికమైనవి..
అందుకే 2014లో బీజేపీ సర్కారు గద్దెనెక్కగానే అత్యాధునిక యుద్ధవిమానాల కొనుగోలుకు టెండర్ పిలించింది. అమెరికా, ఫ్రాన్స్, రష్యా సహా తమ అత్యాధునిక యుద్ధవిమానాలను కొనాలని భారత్ టెండర్ లో పాల్గొన్నాయి. అయితే అన్నింటికంటే అడ్వాన్స్ అయిన ఫ్రాన్స్ తయారీ ‘రాఫెల్’ యుద్ధవిమానాలను భారత్ కొనడానికి సిద్ధమైంది. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని ఏకంగా 36 యుద్ధవిమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఈ ఒప్పందం విలువ ఏకంగా 7.8 బిలియన్ యూరోలు..
అయితే భారత రక్షణ శక్తిని పెంచే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అంచనాలు పెంచి నష్టం చేశారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు ఆరోపించాయి.. బీజేపీ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ముందు తీవ్రంగా ఇరుకునపడింది. ప్రధాని సైతం దీనిపై స్పందించలేదు.
తాజాగా ఎన్ని వివాదాలు ఎదురైనా తొలి రాఫెల్ యుద్ధవిమానాన్ని భారత్ కు డెలివరీ చేసింది ఫ్రాన్స్. ప్రాన్స్ లో పర్యటిస్తున్న డిప్యూటీ ఎయిర్ చీఫ్ మార్షల్ చౌదరీ ఈ యుద్ధ విమానంను అందుకున్నారు. ఈ రాఫెల్ యుద్ధవిమానం అక్టోబర్ 8న భారత వాయుసేనలో అధికారికంగా చేరనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లి రాఫెల్ ను ఇండియాకు తీసుకెళుతారు. మే 2020లోగా రాఫెల్ యుద్ధ విమానాలను నడపడంలో 24 మంది పైలెట్లకు మూడు బృందాలుగా శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత భారత వాయుసేనకు వినియోగిస్తారు.
ఈ రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ లోని రెండు ఎయిర్ బేస్ లో ఉంచనున్నారు. ఒక స్క్వాడ్రాన్ ను హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో.. మరో స్క్వాడ్రాన్ యుద్ధ విమానాలను పశ్చిమ బెంగాల్ లోని హషిమరా ఎయిర్ బేస్ లో ఉంచనున్నారు.