Begin typing your search above and press return to search.

కరోనా రికార్డ్: పిల్లలను పుట్టించడంలో చైనాను ఓడించిన భారత్

By:  Tupaki Desk   |   8 May 2020 8:30 AM GMT
కరోనా రికార్డ్: పిల్లలను పుట్టించడంలో చైనాను ఓడించిన భారత్
X
కరోనా వైరస్ వచ్చింది. లాక్ డౌన్ తెచ్చింది. అందరినీ ఇంటికే పరిమితం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు చావు భయంతో రోజులు లెక్కపెడుతుంటే మన భారతీయులు మాత్రం పిల్లలను కనే పనిలో బిజీగా వర్కవుట్ చేశారు. శృంగారంలో ఓలలాడారు. కరోనా లాక్ డౌన్ వేళ అదే పనిని పెట్టుకున్నారు. దీంతో ఈ సంక్షోభ సమయంలో ఏ దేశంలో లేనంతగా ఎక్కువ జననాలను నమోదు చేసేందుకు తయారయ్యారు. ఇది ప్రపంచంలోనే ఓ అరుదైన రికార్డుగా నిలిచింది.

అవును. లాక్ డౌన్ సమయంలో భారతదేశంలో ఎక్కువ మంది పిల్లలు పుట్టబోతున్నారు. మార్చి 23 న లాక్ డౌన్ అయినప్పటి నుంచి దేశంలో గర్భాదారణల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందట.. అందరూ ఖాళీగా ఉండడంతో భార్యలు - భాగస్వాములతో ఎంజాయ్ చేసి కడుపులు చేసే పనిలో మనోళ్లు సిద్ధహస్తులుగా మారారు. మన దేశంలోనే కాదు.. లాక్ డౌన్ లో గర్భాధారణలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. వచ్చే తొమ్మిది నెలల కాలంలో ప్రపంచం 11.60 కోట్ల మంది శిశువులు పుట్టే అవకాశం ఉందని ఓ పరిశోధనలో తేలింది. వారిలో దాదాపు 2 కోట్లమంది భారతదేశంలో పుడతారు.

లాక్ డౌన్ సమయంలో మొత్తం కొత్త జననాలలో ఇది ఐదో వంతు భారత్ లోనే కావడం మనోళ్ల గర్వకారణంగా చెప్పవచ్చు. కరోనా మహమ్మారి ప్రకటించిన మార్చి లో మొదలైన గర్భాధారణలతో డిసెంబర్ లో జననాలు జరుగుతాయి.. భారతదేశం చాలా జననాలతో ఇప్పుడు రికార్డ్ సృష్టించబోతోంది. ఈ విషయంలో చైనాను మనోళ్లు దాటేయడం విశేషం. భారతదేశం పక్కన చైనా ఉంది. చైనాలో కూడా గర్భాదారణలు పెరిగినా మన అంత కాదు.. అక్కడ 1.35 కోట్ల కొత్త జననాలు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. చైనా తర్వాత మూడో స్థానంలో నైజీరియా (64 లక్షలు) - పాకిస్తాన్ (50 లక్షలు) - ఇండోనేషియా (40 లక్షలు) ఉన్నాయి.

అయితే ఈ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం.. నవజాత శిశువుకు మరియు తల్లికి సరైన ఆరోగ్య సంరక్షణను అందించడం ఈ లాక్డౌన్ సమయంలో పెద్ద సవాలుగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదంతా కరోనా సీజన్ కావడంతో చాలా మంది తల్లులు మరియు శిశువులకు ప్రమాదం పొంచి ఉంటుందని వారు అంటున్నారు.

చాలా ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, ఈ దేశాలలో పిల్లల మరణాలు - గర్భధారణ సంబంధిత మరణాల రికార్డు ఉంది. శిశువుకు సురక్షితంగా ప్రసవించేలా ఈ దేశాల్లోని ఆసుపత్రిల్లో వైద్య మౌలిక సదుపాయాలు అంతగా లేవు. గ్రామీణ చైనాలో కూడా పేలవమైన వైద్య మౌలిక సదుపాయాలున్నాయి. సో గర్భాధారణలు చేశారు సరే కానీ.. ఈ కరోనా టైంలో పిల్లల కాన్పులు - పుట్టుక డేంజర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.