Begin typing your search above and press return to search.
కరోనా అప్డేట్ : 24 గంటల్లో 32,695 కేసులు , 606 మంది మృతి
By: Tupaki Desk | 16 July 2020 1:45 PM ISTదేశంలో కరోనా జోరు కొనసాగుతుంది. నాకు నేనే పోటీ ..నాకు నేనే సాటి అన్నట్టుగా కరోనా మహమ్మారి దేశంలో దూసుకుపోతుంది. రోజురోజుకి నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం ప్రకటించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 32,695 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. అలాగే ఒకే రోజు 30 వేల కి పైగా పాజిటివ్ కేసులు రావడం ఇదే మొదటిసారి. అదే సమయంలో ఒక్క రోజులోనే 606 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు.
తాజాగా లెక్కలతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,68,876కి చేరుకుంది. ప్రస్తుతం 3,31,146 యాక్టివ్ కేసులున్నాయి. అలాగే 6,12,815 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. కరోనాతో మొత్తం మరణించిన వారి సంఖ్య 24,915 కి చేరింది. ఇకపోతే , నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,27,39,490 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,26,826 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది.
ఇకపోతే , ఏపీలో కరోనా మహమ్మారి జోరుకి బ్రేకులు లేకుండా పోతుంది. తాజాగా 2,432 పాజిటివ్ కేసులు నమోదు కాగా ,మొత్తం కేసుల సంఖ్య 35,451కి చేరింది. అలాగే ఇప్పటివరకూ 452 మంది మృతి చెందారు. ప్రస్తుతం 16,621 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, 18,378 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక తెలంగాణ లో కూడా కరోనా జోరు కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్క హైదరాబాద్‌లోనే 796 మందికి పాజిటివ్ గా తేలింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 39,342కి చేరింది. ఇందులో 12,958 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక దేశంలో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అయ్యే రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్ర లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,75,640కి చేరింది. 10,928 మంది వైరస్ కారణంగా చనిపోయారు. తమిళనాడులో 1,51,820 మందికి కరోనా సోకాగా.. 2,167 మంది కన్నుమూశారు. ఇక ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,16,993 కాగా .. . మొత్తంగా 3,487 మంది చనిపోయారు.