Begin typing your search above and press return to search.
లేటెస్ట్ అప్డేట్ : దేశంలో కరోనా బీభత్సం .. ఒక్కరోజులో 50 వేల కేసులు !
By: Tupaki Desk | 30 July 2020 11:30 AM ISTభారత్ లో కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకి కొనసాగుతూనే ఉంది. దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు నమోదు అయ్యే కేసులు కొత్త రికార్డ్స్ నమోదు చేస్తున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 52,123 కేసులు పాజిటివ్ గా నిర్ధారణ కాగా ,775 మంది కరోనా బారినపడి కన్నుమూశారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 15,83,792కు చేరుకోగా ఇప్పటి వరకు 34,968 మంది మృతిచెందారు. ప్రస్తుతం 5,28,242 యాక్టివ్ కేసులు ఉండగా గడిచిన 24 గంటల్లో 32,553 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు మొత్తం 1,81,90,382 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 4,46,642 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది. ఇకపోతే , దేశవ్యాప్తంగా రికవరీ రేటు 64.44 శాతానికి పెరిగిందని.. మరణాల రేటు 2.21 శాతంగా ఉంది.
దేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారీగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 2,47,233 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,193,366కు చేరుకుంది.వీరిలో మొత్తం 10,702,096 మంది వైరస్ నుంచి కోలుకోగా,670,288 మంది మహమ్మారి బారిన పడి చనిపోయారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరణాల జోరు కొనసాగుతోంది. అమెరికాలో వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య లక్షా 50 వేల దాటింది.
ఇకపోతే , తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసుల సంఖ్య 60 వేలు దాటింది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. తాజాగా మరో 1,811 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే 13 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 60,717 కి చేరింది. ఇక ప్రస్తుతం వీరిలో ఆసుపత్రుల్లో 15,640 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 44,572 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 505కి చేరింది.
ఇక, ఏపీలో రోజురోజుకి పాత రికార్డ్స్ తుడిచిపెడుతూ కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 70,584 మంది శాంపిల్స్ ను పరీక్షించగా... వీరిలో 10,093 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఇక ఇప్పటివరకు ఏపీలో మొత్తం 1,20,390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1,213 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 63,771గా ఉండగా... 55,406 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.