Begin typing your search above and press return to search.

భారత్‌ లో కరోనా విలయ తాండవం.. 24 గంట‌ల్లో 34,884 కేసులు

By:  Tupaki Desk   |   18 July 2020 5:45 AM
భారత్‌ లో కరోనా విలయ తాండవం..  24 గంట‌ల్లో 34,884 కేసులు
X
కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజు రోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కొత్త కేసులు - మరణాలూ చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా... గత 24 గంటల్లో 34884 కొత్త కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1038716కి చేరింది. అలాగే... నిన్న ఒక్క రోజే 671 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 26273కి పెరిగింది.

ప్ర‌స్తుతం దేశంలో 3,58,692 మంచి కరోనా కి చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని 6,53,750 మంది వివిధ ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక‌, గడచిన 24 గంట‌ల్లో రికార్డ్ స్థాయిలో దేశవ్యాప్తంగా 3,62,024 కరోనా నిర్దారణ పరీక్షలు చేసారు. దీనితో ఇప్పటి వరకు దేశ‌వ్యాప్తంగా 1,34,33,742 క‌రోనా టెస్ట్‌లు చేసిన‌ట్టు కేంద్రం ప్ర‌క‌టించింది. ప్రస్తుతం మన దేశంలో మరణాల రేటు 2.5గా ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఇది 7గా ఉంది. అంటే ప్రపంచ దేశాలతో పోల్చితే ఇండియాలో కరోనా మరణాలు కాస్త తక్కువగానే నమోదవుతున్నాయి. అయితే , రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ మొత్తం కేసుల్లో ఇండియా టాప్ 3లో ఉంది. అలాగే రోజువారీ కేసుల్లో టాప్ 2లో ఉంది. మొత్తం మరణాల్లో టాప్ 8లో ఉంటున్న ఇండియా... రోజువారీ మరణాల్లో టాప్ 3లో ఉంది.

ఇక , ఆంధ్రప్రదేశ్‌ లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 2602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,646కి చేరింది. అలాగే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1478 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,496 కి చేరింది.