Begin typing your search above and press return to search.
భారత్ లో కల్లోలం: 24 గంటల్లో 46వేల కేసులు..1131 మరణాలు
By: Tupaki Desk | 23 July 2020 9:30 AM ISTదేశంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. బుధవారం దేశవ్యాప్తంగా 46వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 1131మంది కోల్పోయారు.దేశంలో కరోనా వైరస్ మొదలైన తర్వాత ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు.. మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12.40లక్షలకు చేరుకున్నాయి. మృతుల సంఖ్య 29890కి చేరింది. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 7.84 లక్షలమంది కోలుకోగా.. 4.25 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
దేశంలో నమోదైన కేసుల్లో మహారాష్ట్రతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోనే 42శాతం కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 10500 మందికి వైరస్ సోకింది. ఆ తర్వాత ఏపీలో 6045 కేసులు నిర్ధారణ అయ్యాయి. తమిళనాడులో అత్యధికంగా 518మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో 280మంది చనిపోయారు.
*మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 2.37 లక్షలకు చేరగా.. 12556 మంది ప్రాణాలు కోల్పోయారు.
*ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 6045 పాజిటివ్ కేసులు.. 65 మరణాలు నమోదయ్యాయి.
*తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కేసుల సంఖ్య నియంత్రణలో ఉంది. కేసులు సుమారు 1200-1600 మధ్య 14 రోజులుగా నమోదవుతున్నాయి. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 49259కి చేరింది. కొత్తగా 1554 కేసులు నమోదయ్యాయి.