Begin typing your search above and press return to search.

భారత్ లో వైరస్ బీభత్సం..ఒకే రోజు 10,956 పాజిటివ్ కేసులు!

By:  Tupaki Desk   |   12 Jun 2020 8:10 AM GMT
భారత్ లో వైరస్ బీభత్సం..ఒకే రోజు 10,956 పాజిటివ్ కేసులు!
X
భారత్‌ లో రోజురోజుకి వైరస్ ఉదృతి పెరిగిపోతుంది. ప్రతి రోజు వైరస్ పాజిటివ్ కేసులు రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా భారత్ లో తొలిసారి 10వేల మార్కును దాటి పోయింది. గడిచిన 24 గంటల్లో దేశంలో నమోదైన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 10,956 మంది కొత్తగా వ్యాధిబారిన పడ్డారు. 396 మంది మరణించారు. దీంతో మొత్తం. 2,97,535 మందికి వైరస్ సోకింది.

తాజా రిపోర్టు ప్రకారం 396 మంది చనిపోయారు. భారత్ ‌లో వైరస్ పాజిటివ్ ‌ కేసులు మొదలైన రోజు నుంచి ఒకే రోజు ఇంత గరిష్ట స్థాయిలో కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే మొదటి సారి. దీంతో ప్రభుత్వ వర్గాల్లో కలవరం మొదలైంది. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 2,97,535 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీరిలో 8498మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

తాజా రికార్డుతో ప్రపంచంలోనే వైరస్ తో తీవ్రమైన ప్రభావితమైన దేశాల లిస్ట్‌ లో భారత్ నాలుగో స్థానానికి చేరింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్నయూకేను భారత్ దాటేసింది. అక్కడ 2.91 లక్షల మందికి వైరస్ సోకగా మన దేశంలో ఇప్పటివరకు 2,97,535 మందికి గుర్తించారు. ముందు వరుసలో అమెరికా ఆ తర్వాత బ్రెజిల్, రష్యా దేశాలు ఉన్నాయి. దీంతో భారత్ ‌లో ఆందోళన మొదలైంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా కేసులు ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. 75 లక్షలకు పైగా వ్యాధి సోకింది. 4.2 లక్షలకు పైగా ప్రజలు మరణించారు.