Begin typing your search above and press return to search.
దేశంలో భారీగా పెరుగుతున్న కేసులు ..ఒక్కరోజే 9304 !
By: Tupaki Desk | 4 Jun 2020 6:00 AM GMTఈ వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. భారతదేశంలో గత పది రోజులుగా రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేసిన సమయంలో తక్కువ సంఖ్యలో నమోదైన కేసులు ..సడలింపులు ఇచ్చిన తరువాత పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా వైరస్ హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటలలో అత్యధికంగా 9,304 కొత్తగా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 2,16,919 మందికి వైరస్ సోకింది. అందులో 1,06,737 యాక్టివ్ కేసులు ఉండగా, 1,04,106 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 47.99 శాతంగా ఉంది. అటు.. 6075 మరణాలు చోటుచేసుకున్నాయి. నిన్న ఒక్క రోజే 260 మంది వ్యాధితో మరణించారు. రాష్ట్రాల వారీగా చూస్తే ఒక్క మహారాష్ట్రలోనే 74,860 కేసులు నమోదయ్యాయి.
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. బుధవారం 129 కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం వైరస్ కేసుల సంఖ్య 3,020కి చేరింది. వీరిలో 448 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు. వైరస్ తో పోరాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు 1556 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1365 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఏపీలో ఇప్పటివరకు ఉన్న మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3279కి చేరాయి. వీటిలో... 2244 మంది డిశ్చార్జి అయ్యారు. 68 మంది మరణించారు. ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 967గా ఉన్నాయి.