Begin typing your search above and press return to search.
24 గంటల్లో దేశంలో 9,987 కేసులు !
By: Tupaki Desk | 9 Jun 2020 6:01 AM GMTభారత్ లో వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,987 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 331 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,66,598కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 1,29,917 ఉండగా 1,29,215 మంది డిశ్చార్జి అయ్యారు. ఫలితంగా రికవరీ రేటు 48.46గా నమోదైంది. కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 7,466 మంది కరోనా సోకి మరణించారు. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో 88,528 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 33వేలు, ఢిల్లీలో 29,943, గుజరాత్‌లో 20,545 కేసులు నమోదయ్యాయి.
ఇక ఏపీ విషయానికొస్తే .. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,843 కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,387మంది కరోనా నుంచి కోలుకున్నారు. 75మంది వైరస్ తో చనిపోయారు. అలాగే , తెలంగాణలో కొత్తగా 92 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు వైరస్ కారణంగా మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో వైరస్ కేసుల సంఖ్య 3,742 కి చేరింది. 1742 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 1866 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.