Begin typing your search above and press return to search.
సెకండ్ వేవ్ ఎఫెక్ట్..డిసెంబర్ 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు!
By: Tupaki Desk | 26 Nov 2020 4:00 PM GMTదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతుంది. ఒక రోజు తక్కువగా , మరో రోజు ఎక్కువుగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రతి రోజు దాదాపుగా 40 వేలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు 1.35 లక్షల మంది కరోనా కారణంగా మృతి చెందారు. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు అన్ని అంతర్జాతీయ విమనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక రూట్లలో మాత్రమే విమానాలను నడపనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గురువారం వెల్లడించింది.
కరోనా వైరస్ మహమ్మారి కు సంబంధించిన ప్రయాణ, వీసా పరిమితులు పేరుతో తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. విమాన ప్రయాణం చేసేవారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. అయితే, జూన్ 26న విడుదల చేసిన సర్క్యులర్ కు మార్పులు చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది డీజీసీఏ. అలాగే, అన్ని అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణికుల విమానాలను డిసెంబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమానాలు, కార్గో సర్వీసులకు ఈ నిబంధనలు వర్తించవని తెలిపింది.