Begin typing your search above and press return to search.
ట్రంప్ షాకిచ్చినా...భారత్ నిలదొక్కుకుంది
By: Tupaki Desk | 2 Jun 2017 2:13 PM GMTవాతావరణ మార్పులకు సంబంధించిన 190 దేశాల మధ్య కుదిరిన పారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. తనదేశం కోసం ఒప్పందం నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన ట్రంప్ చిత్రంగా ఈ విషయంలో భారతదేశాన్ని బద్‌నాం చేసే ప్రయత్నం చేశారు. పారిస్ ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకమని, ఉద్యోగ - ఉపాధి రంగాలను దెబ్బతీస్తుందన్నందుకే అమెరికా వైదొలగుతోందని ట్రంప్ తెలిపారు. భారత్ - చైనా లాంటి దేశాలకు మాత్రం ఇది అనుకూలంగా ఉందని ఆరోపించారు.
మరోవైపు పారిస్ ఒప్పందంలో కొనసాగుతామని భారత్ స్పష్టంచేసింది. మిగతా దేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఈ ఒప్పందం నుంచి అగ్రరాజ్యం అమెరికా తప్పుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం నేపథ్యంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. `ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇండియా పునరుత్పాదక ఇంధనంపై నమ్మకం ఉంచుతూ పారిస్ ఒప్పందంలో కొనసాగుతుంది. మిగతా దేశాలతో మాకు సంబంధం లేదు` అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అటు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ కూడా పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని స్పష్టంచేశారు.
కాగా పారిస్ ఒప్పందం ప్రకారం అమెరికాతో పాటు దాదాపు 190 దేశాలు 2015లో స్వచ్ఛందంగా తమ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడానికి అంగీకరించాయి. అయితే ఈ ఒప్పందం అమెరికన్ పరిశ్రమలను బలహీనపరుస్తుందన్నది ట్రంప్ వాదనగా వుంది. ర్యావరణ పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు స్కాట్ ప్రూయిట్ తో ట్రంప్ భేటీ అయిన అనంతరం ఒప్పందం నుంచి బయటకు రావాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. గత వారం యురోపియన్ నేతలు కూడా ట్రంప్ పై ఈ విషయంలో ఒత్తిడి తీసుకువచ్చారు. అయినప్పటికీ ట్రంప్ తన పంథా కొనసాగించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/